విపత్తు వేళ నేర్పుతో ఉండాలి
ABN , Publish Date - Jan 09 , 2026 | 11:49 PM
బ్రహ్మోత్సవాల్లో క్షేత్రంలో రద్దీగా ఉండే వాణిజ్య సముదాయాలలో అగ్నిప్రమాదాలు సంభవించినపుడు భక్తులను సురక్షితం చేసేలా చేపట్టవలసిన తక్షణ చర్యలపై మాక్‌డ్రిల్ నిర్వహించారు.
పోలీసు, అగ్నిమాపక సిబ్బందితో మాక్ డ్రిల్
శ్రీశైలం, జనవరి 9 (ఆంధ్రజ్యోతి): బ్రహ్మోత్సవాల్లో క్షేత్రంలో రద్దీగా ఉండే వాణిజ్య సముదాయాలలో అగ్నిప్రమాదాలు సంభవించినపుడు భక్తులను సురక్షితం చేసేలా చేపట్టవలసిన తక్షణ చర్యలపై మాక్‌డ్రిల్ నిర్వహించారు. ఎస్పీ సునీల్ షెరాన్ ఆదేశాల మేరకు పోలీస్, అగ్నిమాపక, రెవెన్యూ, వైద్య, ఆరోగ్య, విద్యుత్‌శాఖ అధికారులు సీపీఆర్ నిర్వహించగా విపత్తు జరిగిన సమయాల్లో సహాయక సిబ్బంది నేర్పుతో వ్యవహరించే తీరును కళ్లకు కట్టినట్లుగా చూపించారు. సిద్ధ్దరామప్ప షాపింగ్ కాంప్లెక్స్‌లో పలు శాఖల అధికారులు భక్తులకు సూచనలిస్తూ తొక్కిసలాట జరగకుండా, క్షతగాత్రులను చికిత్స కోసం తరలించే విధానాన్ని, మంటల్లో చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు చాకచక్యంతో వ్యవహరించే తీరు, ఎగిసిపడుతున్న మంటలను ఆర్పడంలో అగ్నిమాపక సిబ్బందికి సహకరించడంలో సిబ్బంది సమన్వయంతో పాటు భక్తులను కాపాడుకునే తీరు మాక్ డ్రిల్ అని తెలియగానే షాపు యజమానులు ఊపిరి పీల్చుకున్నారు.