ఫిర్యాదుల పట్ల అప్రమత్తంగా ఉండండి
ABN , Publish Date - Feb 23 , 2026 | 11:48 PM
ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు.
కలెక్టర్ రాజకుమారి
నంద్యాల నూనెపల్లి, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లఓని పీజీఆర్‌ఎస్ హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించి, ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ప్రజలు ప్రభుత్వంపై నమ్మకంతో అర్జీలను సమర్పిస్తారని వాటి పరిష్కారంలో నిర్లక్ష్యం చోటుచేసుకోకూడదన్నారు. ప్రస్తుతం 53 దరఖాస్తులు ఇంకా ఓపెన్ చేయలేదని, తక్షణమే పరిశీలించాలన్నారు. అర్జీదారుల అసంతృప్తి కారణంగా 283 దరఖాస్తులు రీఓపెన్ అయ్యాయని, 2,445 దరఖాస్తులు పరిష్కార దశలో ఉన్నాయని గడువులోగా పూర్తిచేయాలని స్పష్టం చేశారు. మొత్తం 311, రెవెన్యూ క్లినిక్స్ ద్వారా 176 అర్జీలు ప్రజలు సమర్పించినట్లు వివరించారు. కార్యక్రమంలో డీఆర్వో తదితరులు పాల్గొన్నారు.