Share News

అవినీతి నిర్మూలనలో భాగంకండి

ABN , Publish Date - Oct 26 , 2026 | 11:29 PM

: అవినీతి రహిత సమాజ నిర్మాణంలో పౌరులందరు భాగం కావాలని కలెక్టర్‌ రాజకుమారి పిలుపునిచ్చారు.

అవినీతి నిర్మూలనలో భాగంకండి
పోస్టర్లను ఆవిష్కరిస్తున్న కలెక్టర్‌

కలెక్టర్‌ రాజకుమారి

నంద్యాల నూనెపల్లి, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి) : అవినీతి రహిత సమాజ నిర్మాణంలో పౌరులందరు భాగం కావాలని కలెక్టర్‌ రాజకుమారి పిలుపునిచ్చారు. సోమవారం కలెక్టరేట్‌లోని కలెక్టర్‌ ఛాంబర్‌లో అవినీతి నిరోధక అవగాహన వారోత్సవాల్లో భాగంగా అవినీతి నిరోధక 1064 పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజల్లో అవినీతి నిరోధక చైతన్యం పెంచి, పారదర్శకమైన, జవాబుదారీతనంతో కూడిన పరిపాలనకు ప్రతి ఒక్కరు సహకరించాలన్నారు. ఈ నెల 26 నుంచి 31 వరకు జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పోస్టర్ల ప్రదర్శన, కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు, విద్యార్థులకు పోటీలు, విజిలెన్స్‌ అధికారులతో సమావేశాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

Updated Date - Oct 26 , 2026 | 11:30 PM