Share News

టీడీపీతోనే బీసీలకు ప్రాధాన్యం

ABN , Publish Date - Oct 14 , 2026 | 12:03 AM

తెలుగుదేశం పార్టీతోనే బీసీలకు రాజకీయ ప్రాధాన్యత లభించిందని ఎమ్మెల్యే కేఈ కృష్ణమూర్తి, టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ అన్నారు.

టీడీపీతోనే బీసీలకు ప్రాధాన్యం
మాట్లాడుతున్న ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు

స్థానిక సంస్థల్లో విజయ ఢంకా మోగిద్దాం

బీసీ రిజర్వేషన్ల కృతజ్ఞత సభలో ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు, గుడిసె కృష్ణమ్మ

పత్తికొండ, అక్టోబరు 13.(ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీతోనే బీసీలకు రాజకీయ ప్రాధాన్యత లభించిందని ఎమ్మెల్యే కేఈ కృష్ణమూర్తి, టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ అన్నారు. మంగళవారం స్థానిక టీడీపీ కార్యాలయంలో బీసీ రిజర్వేషన్లపై కృతజ్ఞత సభను నిర్వహించారు. ముందుగా ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నాయకులు, కార్యకర్తలనుద్దేశించి వారు మాట్లాడారు. టీడీపీ ఆవిర్భావానికి ముందు రాజకీయంగా బీసీలకు ఎలాంటి ప్రాధాన్యత ఉండేది కాదన్నారు. దివంగత ఎన్టీఆర్‌ బీసీలకు పార్టీలో పెద్దపీట వేసి రాజకీయ అవకాశాలు కల్పించారన్నారు. ఆయన బాటలో సీఎం చంద్రబాబునాయుడు ముందుకు సాగుతున్నారన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయ ఢంకా మోగిద్దామని పిలుపునిచ్చారు. అన్నిస్థానాలను గెలుచుకునేం దుకు ప్రతి కార్యకర్త, నాయకుడు కృషి చేయాలన్నారు. ఉమ్మడి జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ తుగ్గలినాగేంద్ర మాట్లాడుతూ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు నాయకత్వంలో స్థానిక సంస్థల్లో పత్తికొండ నియోజకవర్గంలో అన్నిస్థానాలు టీడీపీ గెలుపొందేలా కృషిచేస్తామన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ అబ్జర్వర్‌ పోలన్న, మార్కెట్‌యార్డు చైర్మన్‌ ఆలంకొండ నబీసాహెబ్‌, సింగిల్‌విండో అధక్షుడు చందోలిరంగప్ప, మాజీ జడ్పీ చైర్మన్‌ బత్తినివెంకట్రాముడు, టీడీపీ నాయకులు హోటల్‌ శ్రీనివాసులు, వె ల్దుర్తి సుబ్బరాయుడు, మద్దికెర రాజన్నయాదవ్‌, మర్రిశ్రీరాములు, బత్తిని లోక్‌నాథ్‌, తిరుపాల్‌, తుగ్గలి వెంకటస్వామి, తిరుపాల్‌నాయుడు పాల్గొన్నారు.

Updated Date - Oct 14 , 2026 | 12:03 AM