చంద్రబాబుతోనే బీసీల అభివృద్ధి
ABN , Publish Date - Oct 05 , 2026 | 12:06 AM
రాష్ట్రంలో బీసీల అభివృద్ది సీఎం చంద్రబాబుతో సాధమని ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి అన్నారు. ఆదివారం ఓ ఫంక్షన్ హాల్‌లో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్రస్థాయి రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు.
డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి
డోన్ టౌన్, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో బీసీల అభివృద్ది సీఎం చంద్రబాబుతో సాధమని ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి అన్నారు. ఆదివారం ఓ ఫంక్షన్ హాల్‌లో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్రస్థాయి రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. బీసీల సంక్షేమానికి టీడీపీ కట్టుబడి ఉందని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రాధాన్యమిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. వాల్మీకి కార్పొరేషన్ చైర్‌పర్సన్ కప్పట్రాళ్ల బొజ్జమ్మ, కురువ కార్పొరేషన్ చైర్మన్ మాద్వి దేవేంద్రప్ప, బొందిలి కార్పొరేషన్ చైర్మన్ విక్రమ్‌సింగ్, డైరెక్టర్లు వలసల రామకృష్ణ, వెంకట్రాముడు, గొర్రెల సంఘం చైర్మన్ శ్రీనివాసులు, పీఏసీఎస్ చైర్మన్లు పర్ల శేఖర్, చనుగొండ్ల శ్రీరాములు, మాజీ ఎంపీపీలు టీఈ శేషషణిగౌడు, టీఈ శ్రీనివాసులు పాల్గొన్నారు. అనంతరం బీసీ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధిగా రామచంద్రనాయుడు, మహిళా అధ్యక్షురాలిగా వాల్మీకికుమారి, జిల్లా రైతు సంఘ అధ్యక్షునిగా గోసానిపల్లె బెస్త మల్లయ్యను ఎన్నుకున్నారు. టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు సలీంధ్ర శ్రీనివాసులు, ఆర్‌ఈ నాగరాజు, ఏఈ నాగరాజు, రామ్మోహన్, నాగేశ్వరరావు, చంద్రపల్లె ఆచారి, గోసానిపల్లె శ్రీరాములు ఉన్నారు.
నవరాత్రులకు ఎమ్మెల్యేకు ఆహ్వానం
అమ్మవారిశాలలో నిర్వహించనున్న దసరా నవరాత్రుల ఉత్సవాలకు రావాలని ఎమ్మెల్యే కోట్ల దంపతులను ఆర్యవైశ్య సంఘం సభ్యులు ఆహ్వానించారు. స్వగృహంలో ఆహ్వాన పత్రికను అందజేశారు. కోట్రికే హరికిషన్, జొన్నలగడ్డ శ్రీనివాసులు, ఓంప్రకాష్ పాల్గొన్నారు.