బాస్కెట్ బాల్ పోటీలు ప్రారంభం
ABN , Publish Date - Nov 22 , 2026 | 12:12 AM
స్థానిక డీఎ్‌సఏ అవుట్‌డోర్ స్టేడియంలో 70వ రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ అండర్-17 బాలబాలికల బాస్కెట్‌బాల్ పోటీలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి.
కర్నూలు స్పోర్ట్స్, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): స్థానిక డీఎ్‌సఏ అవుట్‌డోర్ స్టేడియంలో 70వ రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ అండర్-17 బాలబాలికల బాస్కెట్‌బాల్ పోటీలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథులుగా జిల్లా విద్యాశాఖ అధికారి ఎల్. సుధాకర్, డా.బి. శంకర్‌శర్మ విశిష్ట అతిథులుగా జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి బి. భూపతిరావు రిడ్జ్ స్కూల్ సీఈవో గోపినాథ్ హాజరై విద్యార్థుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎల్. సుధాకర్ మాట్లాడుతూ కర్నూలులో రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. డా.బి.శంకర్‌శర్మ మాట్లాడుతూ క్రీడాకారులకు సహకారం అందిస్తానన్నారు. క్రేడో స్కూల్ అధినేత కార్తీక్ కార్యదర్శులు లక్ష్మయ్య, అరుణకుమారి, రాష్ట్ర పోటీల పర్యవేక్షకులు నాగరాజు (చిత్తూరు), కొట్టం శిరీష, ముస్తహీర్ శ్రీను, ఖిల్లా, మాలిక్, రాజశేఖర్, పుల్లన్న, సిరాజ్, సత్య పాల్గొన్నారు.