‘హంద్రీ నీవా’తో బీడు భూములు సస్య శ్యామలం
ABN , Publish Date - Sep 05 , 2026 | 11:41 PM
హంద్రీ;;నీవా నీటితో బీడు భూములు సస్య శ్యామలం అవుతాయని డోన్, పత్తికొండ ఎమ్మెల్యేలు కోట్ల జయ సూర్యప్రకాశ్‌రెడ్డి, కేఈ శ్యాంబాబు అన్నారు.
ఎమ్మెల్యే కోట్ల జయ సూర్యప్రకాశ్ రెడ్డి, కేఈ శ్యాంబాబు
77 చెరువులకు 150 క్యూసెక్కుల నీటి విడుదల
క్రిష్ణగిరి, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి): హంద్రీ;;నీవా నీటితో బీడు భూములు సస్య శ్యామలం అవుతాయని డోన్, పత్తికొండ ఎమ్మెల్యేలు కోట్ల జయ సూర్యప్రకాశ్‌రెడ్డి, కేఈ శ్యాంబాబు అన్నారు. శనివారం ఆలంకొండ లిఫ్ట్ నుంచి 77చెరువులకు హంద్రీనీవా నుంచి 150 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. వారు మాట్లాడుతూ ఎల్‌నినో ప్రభావం దృష్ట్యా నీటిని సాగు కన్న తాగునీటికి పొదుపుగా వాడుకోవాలని ప్రజలను కోరారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో రైతులకు సాగు నీరందక తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక సాగునీటి ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు. రైతులకు అన్నదాత సుఖీభవ పథకం కింద పెట్టుబడి సహాయం అందించి ఆదుకుంటున్నామన్నారు. కార్యక్రమంలో మాజీ డీసీఎంఎస్ చైర్మన్ లక్కసాగరం లక్ష్మీరెడ్డి, పత్తికొండ మార్కెట్‌యార్డ్ చైర్మన్ ఆలంకొండ నబి సాహెబ్, మర్రి శ్రీరాములు, దామోదర్ నాయుడు, ఎల్వీ ప్రసాద్, నక్క నాగరాజు, గురుస్వామి, మమమ్మద్ రఫీ, లక్ష్మీనారాయణ, మదారుసాహెబ్ తదితరులు పాల్గొన్నారు.