అరటి రైతు కన్నీరు..
ABN , Publish Date - Oct 29 , 2026 | 11:51 PM
ఈ రైతు ఆలమూరు గ్రామానికి చెందిన వన్నూరు. రెండున్నర ఎకరాల్లో రూ.2లక్షలు పెట్టుబడి పెట్టి అరటి సాగుచేశారు. ఏడాది పొడవునా కంటికి రెప్పలా కాపాడున్నారు. తీరా దిగుబడి వచ్చే సమయంలో నీరు లేక నష్టపోయారు. రూ.50వేలు మాత్రమే వచ్చిందని రూ.1.5 లక్షలు నష్టపోయానని ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.
ఎల్‌నినో ప్రభావంతో అందని దిగుబడి
పంట తొలగింపు
రుద్రవరం, అక్టోబరు 29(ఆంధ్రజ్యోతి): మండలంలోని ఆలమూరు గ్రామంలో 600 నుంచి 750 ఎకరాల్లో అరటి సాగుచేస్తారు. ఈ ప్రాంతంలో ఎక్కుగా అరటి తోటలు ఉన్నాయి. అయితే ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది భూగర్భజలాలు అడుగంటి మొక్కలకు తడులు అందించడం ఇబ్బందిగా మారింది. మొక్కలు ఎదిగేవరకు ఎంతో జాగ్రత్తగా కాపాడుకున్నామని, తీరా కాయలు వచ్చే సమయంలో ఎండిపోవడంతో నష్టపోయినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. పెట్టుబడి నష్టపోయామని ప్రభుత్వ నష్టపరిహారం అందిచాలని రైతులు కోరారు.