Share News

తుంగా తీరం.. భక్త సాగరం

ABN , Publish Date - Aug 16 , 2026 | 11:57 PM

తుంగభద్ర నదీతీరాన వెలిసిన మంత్రాలయం రాఘవేంద్ర స్వామి క్షేత్రం భక్తి పారవశ్యంతో పరవశించిపోయింది.

తుంగా తీరం.. భక్త సాగరం
మధ్వమార్గ్‌ కారిడార్‌లో కిక్కిరిసిన భక్తులు

మంత్రాలయం, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): తుంగభద్ర నదీతీరాన వెలిసిన మంత్రాలయం రాఘవేంద్ర స్వామి క్షేత్రం భక్తి పారవశ్యంతో పరవశించిపోయింది. ఆదివారం సెలవు దినం కావటంతో దక్షిణాది రాష్ర్టాలైన ఆంరఽధా, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు నుంచి వే లాది మంది భక్తులు తరలివచ్చారు. భక్తుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. అన్నపూర్ణ భోజన శాల, మహాముఖద్వారం, మధ్వమార్గ్‌ కారిడార్‌, ప్రధాన రహదారులు, రాఘవేంద్ర సర్కిల్‌, తుంగభద్ర నదీతీరంలో ఎటుచూసినా భక్తుల రద్దీ కనపడింది. గ్రామదేవత మంచాలమ్మను దర్శించుకొని రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మొక్కులు తీర్చుకున్నారు. రథోత్సవాల ఊరేగింపులో పాల్గొని మఠం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులు ఆశీస్సులు పొందారు. పూజా సామగ్రికి డిమాండ్‌ పెరిగింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొన్న మఠం అధికారులు క్యూలైన్లు, పరిమళ ప్రసాదం వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

Updated Date - Aug 16 , 2026 | 11:57 PM