Share News

మత సామరస్యానికి ప్రతీక బనగానపల్లె

ABN , Publish Date - Jun 20 , 2026 | 11:56 PM

మత సామరస్యానికి ప్రతీక బనగానపల్లె అని రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి, కలెక్టర్‌ రాజకుమారి అన్నారు.

మత సామరస్యానికి ప్రతీక బనగానపల్లె
ఫాతేహాలు నిర్వహిస్తున్న మంత్రి బీసీ, కలెక్టర్‌ రాజకుమారి

మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి, కలెక్టర్‌ రాజకుమారి

ఆస్థానం పీర్లకు ఫాతేహాలు

బనగానపల్లె, జూన్‌ 20 (ఆంధ్రజ్యోతి): మత సామరస్యానికి ప్రతీక బనగానపల్లె అని రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి, కలెక్టర్‌ రాజకుమారి అన్నారు. పట్టణంలోని ఆస్థానం హజరత్‌ అబ్బాస్‌ బంగారు పీర్లకు మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి, కలెక్టర్‌ రాజకుమారిగణియా, బనగానపల్లె నవాబు వారసుడు మీర్‌ఫజిల్‌ఆలీఖాన్‌, షియా మతస్థుల సమక్షంలో శనివారం రాత్రి మొహర్రం వేడుకల్లో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేసి పూలచద్దర్‌ సమర్పించారు. మొహర్రం ప్రభుత్వం వారు అధికార లాంఛనాలతో ప్రారంభించారు. ప్రభుత్వం గత ఏడాది కూడా రూ.10 లక్షలు మొహర్రం కోసం కేటాయించిందని, ఈ ఏడాది కూడా మొహర్రం కోసం రూ.10లక్షలు కేటాయించినట్లు మంత్రి, కలెక్టర్‌ తెలిపారు. నిధులు విడుదల చేయడానికి సహకరించిన ఫరూక్‌ను మంత్రి అభినందించారు కార్యక్రమంలో ఆర్డీవో నరేంద్రనాథరెడ్డి, మైనార్టీ టీడీపీ నాయకులు అన్వర్‌హుసేన్‌, బురానుద్దీన్‌, అల్తాఫ్‌ హుస్సేన్‌, కాశీంబాషా, అత్తార్‌ కలాం, ఇస్మాయిల్‌ ఖాన్‌, నియాజ్‌ హుస్సేన్‌, జాకీర్‌హుసేన్‌, సలాం, పత్తి మాబాషా, అమీర్‌జాన్‌, అధిక సంఖ్యలో షియా ముస్లింలు పాల్గొన్నారు.

Updated Date - Jun 20 , 2026 | 11:56 PM