బెంగుళూరు సభ విజయవంతం
ABN , Publish Date - Jan 25 , 2026 | 11:37 PM
ఆల్ ఇండియా సేవ్ ఎడ్యుకేషన్ కమిటీ బెంగుళూరులో నిర్వహించిన నేషనల్ పీపుల్స్ పార్లమెంటు విజయవంతమైనట్లు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామశేషయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి హరీష్ కుమార్ రెడ్డి ఆదివారం పేర్కొన్నారు.
కర్నూలు ఎడ్యుకేషన్, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): ఆల్ ఇండియా సేవ్ ఎడ్యుకేషన్ కమిటీ బెంగుళూరులో నిర్వహించిన నేషనల్ పీపుల్స్ పార్లమెంటు విజయవంతమైనట్లు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామశేషయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి హరీష్ కుమార్ రెడ్డి ఆదివారం పేర్కొన్నారు. జాతీయ విద్యావిదానం 2020పై విద్యావేత్తలు, విద్యారంగ నిపుణులతో చర్చించి వారి అప్రాయాలను పరిగణనలోకి తీసుకుని పార్లమెంటులో చర్చించి ఆమోదం పొందడం సాంప్రదాయమన్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం అందుకు భిన్నంగా కనీసం పార్లమెంటులో చర్చించకుండా అప్రజాస్వామిక పద్దతిలో నూతన విద్యా విధానాన్ని తీసుకురావడం అప్రజాస్వామికమన్నారు.