Share News

రైతులను ఉత్సాహపరిచేందుకే బండలాగుడు పోటీలు

ABN , Publish Date - Mar 06 , 2026 | 12:21 AM

రైతులను ఉత్సాహపరిచేందుకే బండలాగుడు పోటీలు నిర్వహిస్తున్నామని నందికొట్కూరు టీడీపీ ఇనచార్జి గౌరు వెంకటరెడ్డి అన్నారు.

రైతులను ఉత్సాహపరిచేందుకే బండలాగుడు పోటీలు
పోటీలను ప్రారంభిస్తున్న గౌరు వెంకటరెడ్డి

నందికొట్కూరు టీడీపీ ఇనచార్జి గౌరు వెంకటరెడ్డి

ఓర్వకల్లు, మార్చి 5(ఆంధ్రజ్యోతి): రైతులను ఉత్సాహపరిచేందుకే బండలాగుడు పోటీలు నిర్వహిస్తున్నామని నందికొట్కూరు టీడీపీ ఇనచార్జి గౌరు వెంకటరెడ్డి అన్నారు. గురువారం మండలంలోని కాల్వ గ్రామంలో హజరత సయ్యద్‌ మహమూద్‌ షాఖాద్రి ఉరుసు సందర్భంగా దాతల సహకారంతో పాలపళ్ల బండలాగుడు పోటీలు నిర్వహించారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరు వెంకటరెడ్డి, టీటీడీ బోర్డు సభ్యుడు మల్లెల రాజశేఖర్‌ హాజరై పోటీలను ప్రారంభించారు. తెలుగు రాష్ట్రాల నుంచి 16 జతల ఎద్దులు పోటీలో పాల్గొన్నాయి. ఈ పోటీలో గెలుపొందిన యజమానులకు మొదటి నుంచి 8 బహుమతులు వరుసగా రూ.60వేలు, రూ.50వేలు, రూ.40వేలు, రూ.30వేలు, రూ.20వేలు, రూ.10వేలు, రూ.8 వేలు, రూ.5వేలు నగదును దాతలు అందజేశారు. కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్‌ బ్రాహ్మణపల్లె నాగిరెడ్డి, టీడీపీ నాయకులు పెరుగు పురుషోత్తంరెడ్డి, ప్రభాకర్‌ యాదవ్‌ పాల్గొన్నారు.

Updated Date - Mar 06 , 2026 | 12:21 AM