సంస్కృతికి ప్రతిరూపం బండలాగుడు పోటీలు
ABN , Publish Date - Apr 15 , 2026 | 12:14 AM
గ్రామీణ సంస్కృతికి ప్రతిరూపాలు బండలాగుడు పోటీలు అని కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి అన్నారు.
ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి
గూడూరు ఏప్రిల్ 14(ఆంధ్రజ్యోతి): గ్రామీణ సంస్కృతికి ప్రతిరూపాలు బండలాగుడు పోటీలు అని కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి అన్నారు. మంగళవారం గూడూరులో తిమ్మగురుడు స్వామి జాతర సందర్భంగా ఆరు పళ్ల విభాగం ఎద్దుల బండలాగుడు పోటీలు పట్టణ టీడీపీ అధ్యక్షుడు కురుకుంద రామాంజనేయులు, సింగిల్ విండో డైరెక్టర్ రేమట వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి పాల్గొని బండలాగుడు పోటీలను ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులను పోత్సహించేందుకు ఎద్దుల పోటీలను నిర్వహిం చడం హర్షనీయమన్నారు. విజేతలకు మొదటి బహుమతి రూ.50వేలు, రెండో బహుమతి రూ.40వేలు, మూడో బహుమతి రూ.30వేలు, నాలుగో బహుమతి రూ.20 వేలు, ఐదో బహుమతి రూ.15వేలు, ఆరో బహుమతి రూ.10వేలు, ఏడో బహుమతి రూ.8వేలు, ఎనిమిదో బహుమతి రూ.5వేలు దాతలు అందజేశారు. కార్యక్రమం లో మాజీ కౌన్సిలర్లు కోడుమూరు షాషావలి, బుడ్డంగలి, నాగప్ప యాదవ్, పౌలు, ప్రభాకర్ నాయుడు, పెద్ద చాంద్‌బాషా సుమన బాబు, కర్ణ, బాబు, నాయుడు, గిరినాథరెడ్డి పాల్గొన్నారు.