Share News

ఎండిపోతున్న అరటి మొక్కలు

ABN , Publish Date - Aug 31 , 2026 | 12:08 AM

ఎల్‌నినో ప్రభావంతో అరటి మొక్కలు ఎండిపోతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మండలంలో బోరు బావుల కింద 600 ఎకరాల్లో అరటి సాగు చేపట్టారు

ఎండిపోతున్న అరటి మొక్కలు
మదనంతపురం గ్రామంలో ఎండిపోతున్న అరటి మొక్కలు

ఆందోళన చెందుతున్న రైతులు

కొలిమిగుండ్ల, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): ఎల్‌నినో ప్రభావంతో అరటి మొక్కలు ఎండిపోతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మండలంలో బోరు బావుల కింద 600 ఎకరాల్లో అరటి సాగు చేపట్టారు. వర్షాలు కురవక పోవడంతో భూగర్భ జాలాలు అడుగంటి నీరందడం లేదు. మధనంతపురం, అబ్దులాపురం, కొలిమిగుండ్ల గ్రామాల్లో ఇప్పటికే 20బోర్లలో భూగర్భ జలాలు అడుగంటి నీరు రాకుండా ఒట్టిపోయాయి. ఎల్‌నినో ప్రభావానికి అరటి మొక్కలు బెట్టకు గురయ్యాయని ఆకులు వాడుముఖం పట్టాయంటున్నారు. ఎకరాకు రూ.లక్ష పెట్టుబడి పెట్టామని, వర్షం కురవకపోతే పంట నష్టపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు.

Updated Date - Aug 31 , 2026 | 12:08 AM