Share News

రూ.5 లక్షల ఎరువుల విక్రయంపై నిషేధం

ABN , Publish Date - Jun 05 , 2026 | 12:23 AM

ఎరువులను పక్కదారి పట్టించే డీలర్లు, వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని, ఇందులో భాగంగానే ఎరువులు, క్రిమిసంహారక మందులు, విత్తనాల దుకాణాలపై నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నట్లు విజిలెన్స్‌ వ్యవసాయాధికారి విశ్వనాథ్‌ కల్లూరు మండల వ్యవసాయాధికారి విష్ణువర్థన్‌ రెడ్డి తెలిపారు.

రూ.5 లక్షల ఎరువుల విక్రయంపై నిషేధం
తనిఖీలు చేస్తున్న విజిలెన్స్‌ అధికారులు

కర్నూలు అగ్రికల్చర్‌, జూన్‌ 4 (ఆంధ్రజ్యోతి): ఎరువులను పక్కదారి పట్టించే డీలర్లు, వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని, ఇందులో భాగంగానే ఎరువులు, క్రిమిసంహారక మందులు, విత్తనాల దుకాణాలపై నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నట్లు విజిలెన్స్‌ వ్యవసాయాధికారి విశ్వనాథ్‌ కల్లూరు మండల వ్యవసాయాధికారి విష్ణువర్థన్‌ రెడ్డి తెలిపారు. గురువారం కల్లూరు మండలంలోని రాయలసీమ సీడ్స్‌, లక్ష్మీ సీడ్స్‌, కామధేను ట్రేడర్స్‌ విత్తన దుకాణాలపై విజిలెన్స్‌ అధికారులు, వ్యవసాయాధికారులు తనిఖీలు నిర్వహించారు. విత్తన అమ్మకాలు నిల్వలపై సరైన ధృవపత్రాలు చూపకపోవడం వల్ల రూ.5 లక్షలు విలువ చేసే విత్తనాల అమ్మకాలపై నిషేధం విధించారు. ఈ తనిఖీలో విజిలెన్స్‌ సీఐ పవన్‌ కుమార్‌, విజిలెన్స్‌ వ్యవసాయాధికారి విశ్వనాథ్‌, కల్లూరు మండల వ్యవసాయాధికారి విష్ణువర్దన్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Jun 05 , 2026 | 12:23 AM