Share News

వెదురు అక్రమ రవాణా

ABN , Publish Date - Jul 09 , 2026 | 12:05 AM

ఫారెస్టు సబ్‌ డివిజనులోని చెలిమ రేంజ్‌ పెద్దకంబలూరు సెక్షన్‌ పరిధిలో వెదురు అక్రమ రవాణాకు తెర తీసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

వెదురు అక్రమ రవాణా
పెద్దకంబలూరులో నిల్వ ఉంచిన వెదురు బొంగులు

రుద్రవరం, జూలై 8 (ఆంధ్రజ్యోతి): ఫారెస్టు సబ్‌ డివిజనులోని చెలిమ రేంజ్‌ పెద్దకంబలూరు సెక్షన్‌ పరిధిలో వెదురు అక్రమ రవాణాకు తెర తీసినట్లు ఆరోపణలు ఉన్నాయి. పెద్దకంబలూరు గ్రామంలో కొందరు వెదురును నిల్వచేసి రాత్రివేళల్లో తరలిస్తున్నట్లు ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు విమర్శలున్నాయి. పెద్దకంబలూరు నుంచి ఆళ్లగడ్డ, అవుకు, కర్నూలు, నంద్యాల, ఇంకా పలు ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ దందాకు ఫారెస్టు అధికారులు సహకరిస్తున్నట్లు విమర్శలున్నాయి. ఇప్పటికైనా స్పందించి అక్రమ రవాణాను అరికట్టి అటవీ సంపదను కాపాడాలని పర్యావరణ ప్రేమికులు, ప్రజలు కోరుతున్నారు.

Updated Date - Jul 09 , 2026 | 12:05 AM