బ్యాలెట్ పేపర్ సిద్ధం
ABN , Publish Date - Oct 01 , 2026 | 11:44 PM
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల బ్యాలెట్ పేపర్ సిద్ధంగా ఉందని జిల్లా పరిషత్ సీఈఓ ఆర్. సుధాకర్‌రెడ్డి తెలిపారు. బ్యాలెట్ పేపర్‌తో పాటు ఎన్నికలను నిర్వహించేందుకు అవసరమైన సామగ్రి కమిషనర్ పంచాయతీరాజ్ శాఖ నుంచి వచ్చిందన్నారు.
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై జిల్లా పరిషత్
సీఈవో సుధాకర్‌రెడ్డి
కర్నూలు న్యూసిటీ, అక్టోబరు 1(ఆంధ్రజ్యోతి): జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల బ్యాలెట్ పేపర్ సిద్ధంగా ఉందని జిల్లా పరిషత్ సీఈఓ ఆర్. సుధాకర్‌రెడ్డి తెలిపారు. బ్యాలెట్ పేపర్‌తో పాటు ఎన్నికలను నిర్వహించేందుకు అవసరమైన సామగ్రి కమిషనర్ పంచాయతీరాజ్ శాఖ నుంచి వచ్చిందన్నారు. ఈ సామగ్రిని భద్రపరిచిన డీపీఆర్‌సీ భవనంలో గదిని ఆయన గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా సీఈఓ మాట్లాడుతూ కర్నూలు జిల్లాకు 19.9, నంద్యాల జిల్లాకు 19 మెట్రిక్ టన్నుల బ్యాలెట్ పేపర్ వచ్చిందన్నారు. కర్నూలు జిల్లాలో ఎన్నికల నిర్వహణకు అవసరమైన బ్యాలెట్ బాక్స్‌లు పెద్దవి 1595, మీడియం 14, చిన్నవి 220 ఉన్నాయన్నారు. నంద్యాల జిల్లాకు పెద్ద బ్యాలెట్ బాక్సులు 154, మీడియం 112, చిన్నవి 139 వచ్చాయన్నారు. నంద్యాల జిల్లాకు బ్యాలెట్ బాక్సులు తక్కువగా ఉన్నందున అక్కడి అవసరాల మేరకు 1500 బాక్సులకు సీపీఆర్ పంపనున్నట్లు తమకు సమాచారం వచ్చిందన్నారు. మండలాల్లో ఎక్కడైనా బ్యాలెట్ బాక్సులకు చిన్న చిన్న రిపేర్లు ఉంటే వెంటనే చేయించుకోవాలని ఎంపీడీవోలకు ఆదేశాలు జారీ చేశామన్నారు. ఇప్పటికే ఈ ఎన్నికలకు పోలింగ్ కేంద్రాలను గుర్తించామని, అలాగే ఓటరు జాబితాలను ప్రత్యేకించి బీసీ, ఎస్సీ, ఎస్టీ ఓటరు జాబితాలను రూపొందించి ఆయా మండల అభివృద్ధి అధికారి కార్యాలయాల్లో ప్రచురించినట్లు తెలిపారు. కర్నూలు జిల్లాలో 26 జడ్పీటీసీ, 432 ఎంపీడీసీలు, నంద్యాల జిల్లాలో 38 జడ్పీటీసీ, 377 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయన్నారు. అలాగే కర్నూలు జిల్లాలో 1432, నంద్యాల జిల్లాలో 1238 పోలింగ్ కేంద్రాలను గుర్తించినట్లు ఆయన తెలిపారు. కర్నూలు జిల్లా పరిధిలో గ్రామీణ ఓటర్లు మొత్తం 12,50,166 కాగా ఇందులో పురుషులు 6,21,167, మహిళలు 6,28,834 ఇతరులు 165 మంది ఉన్నారన్నారు. అదే విధంగా నం ద్యాల జిల్లాలో గ్రామీణ ఓటర్లు మొత్తం 10,84,704, పురుషులు 5,33,160, మహిళలు 5,51,419, ఇతరులు 125 ఉన్నారని తెలిపారు.పరిపాలన అధికారి మురళీమోహన్‌రెడ్డి, సీనియర్ అసిస్టెంట్ సిద్ధారెడ్డి, సిబ్బంది వీరేష్ తదితరులు పాల్గొన్నారు.