గుంతల రోడ్లు
ABN , Publish Date - Aug 16 , 2026 | 11:53 PM
మండలంలోని ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి సొంత ఏకపక్ష గ్రామమైన దిబ్బనదొడ్డి రోడ్లు గుంతలమయంగా మారింది. 52- బసాపురంకు మజరా గ్రామమైన దిబ్బదొడ్డి ఆర్‌అండ్‌బీ రోడ్డు పూర్తిగా ధ్వంసమైంది.
వైసీపీ ప్రభుత్వంలో రోడ్లను మరిచారు
కూటమి ప్రభుత్వంలో రూ.1.80 కోట్లు మంజూరు
మంత్రాలయం, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): మండలంలోని ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి సొంత ఏకపక్ష గ్రామమైన దిబ్బనదొడ్డి రోడ్లు గుంతలమయంగా మారింది. 52- బసాపురంకు మజరా గ్రామమైన దిబ్బదొడ్డి ఆర్‌అండ్‌బీ రోడ్డు పూర్తిగా ధ్వంసమైంది. 5ఏళ్ల వైసీపీ పాలనలో ఈరోడ్డు నిర్మాణానికి ఒక్కపైసా మంజూరు కాలేదు. దీంతో ఆ గ్రామాల ప్రజలు రాకపోకలు సాగించేందుకు తీవ్ర ఇబ్బంందులు పడుతున్నారు. బసాపురం, రాంపురం రోడ్డు పరిస్థితి దయనీయంగా ఉన్నాయి. దీంతో 1.20 కి.మీ పొడవు ఉన్న దిబ్బన దొడ్డి గ్రామానికి రూ1.80 కోట్లు , 52-బసాపురం 0.69 కి.మీలకు రూ.58 లక్షలు, రాంపురంకు రూ.78 లక్షలు ప్రతిపాదనలు సిద్ధంచేశారు. ఉద్యానవన శాఖనుంచి ఈ మూడు ఆర్‌అండ్‌బీ రోడ్ల త్వరలో పనులు చేపట్టనున్నారు. ఈమూడు గ్రామాలు ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి కనుసన్నల్లో ఉన్నవే. వైసీపీ అధికారంలో ఉన్నా ఈరోడ్ల మరమ్మతులకు నిధులు మంజూరు కాలేదు. త్వరలో నిధులు మంజూరుకు టీడీపీ పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ రోడ్లకు త్వరలో మహర్దశ రానుంది.
త్వరలో రోడ్డు నిర్మాణం పనులు చేపడతాం
దిబ్బనదొడ్డి, బసాపురం, రాంపురం గ్రామాలకు ఉద్యానవన శాఖ నిధులతో ఆర్‌అండ్‌బీ అధికారులతో త్వరలో నిర్మాణం పనులు చేపడతాం. మొదటి విడతలో దిబ్బనదొడ్డి గ్రామానికి రూ.1.80కోట్లతో, 52-బసాపురానాకి రూ.58లక్షలు, రెండవ విడతలో రాంపురంకు రూ.78లక్షలు మంజూరయ్యాయి. వెంటనే రోడ్లు పనులు చేపట్టి గ్రామస్తులు ఇబ్బందులు పడకుండా చూస్తాం. - మల్లయ్య, ప్రత్యేక అధికారి, దిబ్బనదొడ్డి, మంత్రాలయం మండలం