Share News

రాష్ట్రంలో అధ్వాన పాలన: బుగ్గన

ABN , Publish Date - Jan 28 , 2026 | 12:16 AM

రాష్ట్రంలో అధ్వాన పాలన నడుస్తోందని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి ఆరో పించారు.

రాష్ట్రంలో అధ్వాన పాలన: బుగ్గన
మాట్లాడుతున్న మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి

డోన రూరల్‌, జనవరి 27(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో అధ్వాన పాలన నడుస్తోందని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి ఆరో పించారు. మంగళవారం డోన పట్టణం సమీపం లోని వెంకటాపురం రోడ్డులో ఉన్న ప్రైవేటు ఫంక్షన హాలులో వైసీపీ నియోజకవర్గ పార్టీ సంస్థాగత నిర్మాణ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పార్టీ జిల్లా అధ్యక్షుడు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌ రెడ్డితోపా టు మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి హాజరయ్యారు. ఈసంద ర్భంగా మాజీ మంత్రి బుగ్గన మాట్లాడుతూ పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు అల్లాడుతున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లుగా కూడా లేదని ఆరోపించారు. గత ప్రభుత్వంలో తమ అధినేత వైఎస్‌ జగన్మోహన రెడ్డి మెడికల్‌ కాలేజీలను నిర్మిస్తే కూటమి ప్రభుత్వం వాటి ప్రైవేటీకరణకు ప్రయత్నిస్తుందని విమర్శించారు. సమావేశంలో జడ్పీ చైర్మన పాపిరెడ్డి, డోన ఎంపీపీ రేగటి రాజశేఖర్‌ రెడ్డి, డోన జడ్పీటీసీ బద్దెల రాజ్‌కుమార్‌, రాష్ట్ర మీట్‌ కార్పొరేషన మాజీ చైర్మన శ్రీరాములు, బేతంచెర్ల మున్సిపల్‌ చైర్మన చలంరెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Jan 28 , 2026 | 12:16 AM