బాబు జగ్జీవన్‌రామ్ ఆశయాలు స్ఫూర్తిదాయకం
ABN , Publish Date - Apr 05 , 2026 | 11:28 PM
దేశ నిర్మాణంలో బాబు జగ్జీవన్‌రామ్ కీలక పాత్ర పోషించారని, ఆయన ఆశయాలు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ ఎండీ ఫరూక్ అన్నారు.
న్యాయ, మైనార్టీ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్
నంద్యాల రూరల్, ఏప్రిల్ 5 (ఆంధ్రజ్యోతి): దేశ నిర్మాణంలో బాబు జగ్జీవన్‌రామ్ కీలక పాత్ర పోషించారని, ఆయన ఆశయాలు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ ఎండీ ఫరూక్ అన్నారు. ఆదివారం బాబు జగ్జీవన్‌రామ్ జయంతిని పుర స్కరించుకొని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ఆయన విగ్రహానికి కలెక్టర్‌తో కలిసి పూలమాల వేసి నివాళులర్పించారు. మంత్రి మాట్లాడుతూ సామా జిక న్యాయం, సమానత్వం కోసం జగ్జీవన్‌రామ్ చేసిన చిరస్మరనీ యమన్నారు. ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరు కొనసాగించాలని పిలు పునిచ్చారు. కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ అట్టడుగు వర్గాల అభ్యు న్నతికి జగ్జీవన్‌రామ్ చేసిన కృషి స్ఫూర్తిదాయకమని, యువత ఆయనను ఆదర్శంగా తీసుకొని లక్ష్యసాధన దిశగా ముందుకు సాగాలని సూచించారు. కార్యక్రమంలో ఏఎస్పీ జావళి, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి చింతామణి, మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, కొమ్ముపాలెం శ్రీనివాసులు, లింగస్వామి, చిన్న వెంకటసుబ్బయ్య, దండు వీరయ్య, లక్ష్మన్న, బెనర్జీ, బాలప్వామి తదితరులు పాల్గొన్నారు.