ఆయుష్..!
ABN , Publish Date - Sep 08 , 2026 | 12:27 AM
మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రం పక్కనే ఉన్న ఆయుర్వేద ఆసుపత్రి విభాగం నిరుపయోగంగా మారింది. ఇక్కడ వైద్యులు, సిబ్బంది లేకపోవడంతో ఎప్పుడు మూసివేసి ఉంటుందని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు
కొలిమిగుండ్లలో అందని ఆయుర్వేద సేవలు
వైద్యులు, సిబ్బంది లేరు.. వైద్యసేవలు లేవు
కొలిమిగుండ్ల, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రం పక్కనే ఉన్న ఆయుర్వేద ఆసుపత్రి విభాగం నిరుపయోగంగా మారింది. ఇక్కడ వైద్యులు, సిబ్బంది లేకపోవడంతో ఎప్పుడు మూసివేసి ఉంటుందని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏడేళ్లుగా దీర్ఘకాలిక వ్యాఽధిగ్రస్థులకు ఎంతగానో ఉపయోగపడే ఆయుర్వేదిక్ వైద్య సేవలు అందకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. గతంలో ఈ విభాగానికి సంభంధించి పీహెచ్‌సీలో ఆయుర్వేద వైద్యుడితో పాటు, సిబ్బంది వుండే వారు. మందులు సైతం అందుబాటులో ఉండేవి. అయితే గత ప్రభుత్వం ఆయుర్వేదిక్ వైద్య సిబ్బందికి జీతాలు చెల్లించుకుండా నిలిపి వేయడంతో పాటు, మందులను కూడా సరఫరా చేయకపోవడంతో ఆ విభాగం పూర్తిగా మూతబడింది. ఉన్నతాధికారులు స్పందిం చి వైద్యుడు, సిబ్బందిని కేటాయించి, విభాగం పనిచేసేలా చూసి తమను ఆదుకోవాలని రోగులు కోరుతున్నారు.