Share News

ఆయు..ష్‌!

ABN , Publish Date - Jun 15 , 2026 | 12:26 AM

మండలకేంద్రంలో ఆయుర్వేద వైద్య సేవలు నిలిచిపోయాయి. ప్రాథమిక ఆసుపత్రిలోనే ఆయుష్మాన్‌ ఆరోగ్య మందిర్‌ ఏర్పాటుచేఏసినా, వైద్యులు, సిబ్బందిని నియమించకపోవంతో మూతపబడింది. దీర్ఘకాలిక వ్యాఽధిగ్రస్థులు ఎంతగానో ఉపయోగపడే ఆయుర్వేద వైద్య సేవలు అందడంలదు. గతంలో వైద్యుడితో పాటు, సిబ్బంది వుండే వారు. అయితే గత ప్రభుత్వం జీతాలు నిలిపివేయడంతో పాటు, మందులను కూడా సరఫరా చేయలేదు. దీంతో ఈ విభాగం పూర్తిగా మూతబడింది. ప్రభుత్వం ఆయుర్వేద వైద్యసేవలందేలా చర్యలు తీసుకోవాలని రోగులు కోరుతున్నారు.

ఆయు..ష్‌!
కొలిమిగుండ్లలో మూతపడిన ఆయుష్మాన్‌ ఆరోగ్య కేంద్రం

వైద్యులు, సిబ్బంది నిల్‌

ఏడేళ్లుగా ఆయుర్వేదిక్‌ కేంద్రం మూత

కొలిమిగుండ్ల, జూన్‌ 14 (ఆంధ్రజ్యోతి): మండలకేంద్రంలో ఆయుర్వేద వైద్య సేవలు నిలిచిపోయాయి. ప్రాథమిక ఆసుపత్రిలోనే ఆయుష్మాన్‌ ఆరోగ్య మందిర్‌ ఏర్పాటుచేఏసినా, వైద్యులు, సిబ్బందిని నియమించకపోవంతో మూతపబడింది. దీర్ఘకాలిక వ్యాఽధిగ్రస్థులు ఎంతగానో ఉపయోగపడే ఆయుర్వేద వైద్య సేవలు అందడంలదు. గతంలో వైద్యుడితో పాటు, సిబ్బంది వుండే వారు. అయితే గత ప్రభుత్వం జీతాలు నిలిపివేయడంతో పాటు, మందులను కూడా సరఫరా చేయలేదు. దీంతో ఈ విభాగం పూర్తిగా మూతబడింది. ప్రభుత్వం ఆయుర్వేద వైద్యసేవలందేలా చర్యలు తీసుకోవాలని రోగులు కోరుతున్నారు.

ప్యాపిలి: మండలంలోని జలదుర్గం గ్రామంలో ఆరు నెలల నుంచి వైద్యుడు లేక ఆయుర్వేద వైద్యశాల మూతపడింది. వైద్యం కోసం వచ్చే రోగులు నిరాశతో వెనుదిరుగతున్నారు. ఇక్కడి వెద్యుడు సెలవుపై వెళ్లినట్లు తెలుస్తోంది. అధికారులు స్పందించి వైద్యుడిని నియమించి వైద్య సేవలు కొనసాగించాలని రోగులు కోరుతున్నారు.

Updated Date - Jun 15 , 2026 | 12:26 AM