హెచ్‌పీవీపై అవగాహన పెంచుకోవాలి
ABN , Publish Date - May 02 , 2026 | 10:37 PM
తల్లులకు వచ్చే హ్యూ మన్ పాపిలోమా వైరస్(హెచ్‌పీవీ)పై అవగాహన పెంచుకోవాలని ఆర్‌బీఎస్‌కే జిల్లా అధికారి డా.మహేశ్వర ప్రసాద్ సూచించారు.
ఆర్‌బీఎస్‌కే జిల్లా అధికారి డా.మహేశ్వర ప్రసాద్
కర్నూలు హాస్పిటల్, మే 2(ఆంధ్రజ్యోతి): తల్లులకు వచ్చే హ్యూ మన్ పాపిలోమా వైరస్(హెచ్‌పీవీ)పై అవగాహన పెంచుకోవాలని ఆర్‌బీఎస్‌కే జిల్లా అధికారి డా.మహేశ్వర ప్రసాద్ సూచించారు. శని వారం నగరంలోని బండిమెట్ట పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన సందర్శించారు. హెచ్‌పీవీపై జరిగిన అవగాహన కా ర్యక్రమం లో ఆయన మాట్లాడారు. నడుము నొప్పి, కాళ్ల వాపు, అలసట బరువు, ఆకలి తగ్గడం మొదలైవని గర్బాశయ ముఖద్వారా క్యాన్సర్ లక్షణాలని వివరించారు. కిషోర బాలికలు హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవాలని, ఇది ఆడపిల్లలకు రక్షణ కవచంగా పనిచేస్తుందన్నారు. కార్యక్రమంలో వైద్యాధికారి డా.ముషాహీర్ చౌదరి, స్టాఫ్ నర్సులు సుజాత, జ్యోతి, ల్యాబ్ టెక్నీషీయన్, హమీదా, ప్రొజెక్షనిస్టు ఖలీల్ పాల్గొన్నారు.