‘సురక్షిత బచపన అభియాన’పై అవగాహన
ABN , Publish Date - Nov 21 , 2026 | 11:47 PM
స్థానిక నందికొట్కూరు రోడ్డులోని మిలిటరీ కాలనీలోని జిల్లా పరిషత హైస్కూల్ సురక్షిత బచపన అభియాన కార్యక్రమంపై శనివారం అవగాహన సదస్సు జరిగింది.
కర్నూలు లీగల్, నవంబరు 21(ఆంధ్రజ్యోతి): స్థానిక నందికొట్కూరు రోడ్డులోని మిలిటరీ కాలనీలోని జిల్లా పరిషత హైస్కూల్ సురక్షిత బచపన అభియాన కార్యక్రమంపై శనివారం అవగాహన సదస్సు జరిగింది. కర్నూలు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ న్యాయాధికారి ఎం.సంధ్యారాణి పాల్గొని మాట్లా డుతూ బాలల హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. బాలలపై లైంగిక నేరాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, బాధితులు తమపై జరిగిన లైంగిక వేధింపుల గురించి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని తెలిపారు. బాలలకు ఎవరికైనా ఇబ్బందులు ఎదురైతే టోల్ ఫ్రీ నెంబర్ 15144కు ఫోన చేస్తే వారి సమస్యలు పరిష్కరిస్తామని ఆమె తెలిపారు. పాఠశాల ఇనచార్జి హెచఎం షఫీ వుల్లా, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఫ స్థానిక గార్గేయపురంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో బాలల హక్కులపై అవగాహన కార్యక్రమం జరిగింది. రెండవ అదనపు జూని యర్ సివిల్ న్యాయాధికారి సరోజనమ్మ విద్యార్థులకు పోక్సో చట్టం, మాదక ద్రవ్యాల దుర్వినియోగంపై అవగాహన కల్పించారు. ఐసీడీఎస్ కోఆర్డినేటర్ నరసింహ, హెచఎం ప్రసాద్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.