కొత్త చట్టాలపై అవగాహన తప్పరిసరి
ABN , Publish Date - May 06 , 2026 | 11:40 PM
మహిళలు, చిన్నారుల రక్షణ కోసం వచ్చిన కొత్త చట్టాలపై వారికి అవగాహన ఉండాలని పోలీసులు అన్నారు.
నంద్యాల క్రైం, మే 06 (ఆంధ్రజ్యోతి): మహిళలు, చిన్నారుల రక్షణ కోసం వచ్చిన కొత్త చట్టాలపై వారికి అవగాహన ఉండాలని పోలీసులు అన్నారు. ఎస్సీ సునీల్ షోరాణ్ ఆదేశాల మేరకు బుధవారం జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో మహిళల భద్రత, శక్తి యాప్‌లపై అవగాహన కల్పించి వాటివల్ల కలిగే ప్రయోజనాలను పోలీసులు వివరించారు. సైబర్ క్రైమ్ నేరాలు, రోడ్డు ప్రమాదాలు, బాల్య వివాహాలు, కొత్త చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పోలీస్ అధికారులు మాట్లాడుతూ 100, 112, 1930, 1972లపై మహిళలకు అవగాహన తప్పక ఉండాలని సూచించారు.