Share News

చట్టాలపై అవగాహన పెంచుకోవాలి: డీఎస్పీ

ABN , Publish Date - Apr 18 , 2026 | 12:04 AM

మహిళలు చట్టాలపై అవగా హన పెంచుకోవాలని కర్నూలు మహిళా పోలీసు డీఎస్పీ ఉపేంద్రబాబు అన్నారు.

చట్టాలపై అవగాహన పెంచుకోవాలి: డీఎస్పీ
పోలీసులను సన్మానిస్తున్న ఆలయ కమిటీ సభ్యులు

కోడుమూరు, ఏప్రిల్‌ 17(ఆంధ్రజ్యోతి): మహిళలు చట్టాలపై అవగా హన పెంచుకోవాలని కర్నూలు మహిళా పోలీసు డీఎస్పీ ఉపేంద్రబాబు అన్నారు. స్థానిక లక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయం ఆవరణలో శుక్రవారం మీ రక్షణ మా బాధ్యత మహిళలపై జరుగుతున్న నేరాలపై పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎస్‌ఐ డీవై స్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ మహిళలకు రక్షణగా ప్రభుత్వం, పోలీసులు ఉన్నారన్నారు. సీఐ తబ్రేజ్‌ మాట్లా డుతూ మహిళల కోసం ప్రత్యేక చట్టాలు, న్యాయస్థానాలు ఉన్నాయ న్నారు. మహిళలపై జరుగుతున్న హింసలు, నేరాలను అరికట్టాలంటే సమాజంలో ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాల న్నారు. ఎక్కడైన నేరా లు జరుగుతున్నప్పడు పోలీసులకు సమాచారం అందించాలని, సమాచారం అందించిన వాళ్ల పేర్లు గోప్యంగా ఉంచుతామన్నారు. మహిళలకు కష్టం వచ్చినప్పుడు ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్‌ నంబర్లు 112, 181, 1098,1930,100 సంప్రదించాలని కోరారు. ఎంపీడీవో రాముడు మాట్లా డుతూ తల్లిదండ్రులు పిల్లలను బాధ్యతతో పెంచాలన్నారు. సమావేశం అనంతరం లక్ష్మీవెంకటేశ్వరస్వామి ఆలయ చైర్మన్‌ ఎద్దుల మహే శ్వర రెడ్డి పోలీసులను సన్మానించారు. కార్యక్రమంలో గూడూరు, సి.బెళ గల్‌ ఎస్‌ఐలు రాజకుళ్లాయప్ప, వేణుగోపాల్‌, ఏఎస్‌ఐ నాయక్‌ పాల్గొన్నారు.

Updated Date - Apr 18 , 2026 | 12:04 AM