ఎన్నికల విధులపై అవగాహన అవసరం
ABN , Publish Date - Oct 29 , 2026 | 12:03 AM
ఎన్నికల విధు లపై అవగాహన అవసరమని అడిషనల్ ఎలక్షన అథారిటీ, నగర పాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు అన్నారు.
కర్నూలు కల్చరల్, అక్టోబరు 28(ఆంధ్రజ్యోతి): ఎన్నికల విధు లపై అవగాహన అవసరమని అడిషనల్ ఎలక్షన అథారిటీ, నగర పాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు అన్నారు. బుధవారం నగరంలోని ఎస్‌బీఐ కాలనీలోగల నగరపాలక సంస్థ సమావేశ భవనంలో రిటర్నింగ్ అధికారులు, ప్రిసైడింగ్ అధికారులు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. పోలింగ్ సామగ్రి స్వీకరణ, పోలింగ్ నిర్వహణ విధానాలపై అవగాహన కల్పించారు. బ్యాలెట్ పెట్టెల నిర్వహణపై ప్రాయోగిక ప్రదర్శన నిర్వహించి, ఎన్ని కల విధుల నిర్వహణలో తీసుకో వాల్సిన జాగ్రత్తలను వివరించారు. కమిషనర్ మాట్లాడుతూ ఎన్నికల నిబంధనలను పక్కాగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రార్థనా మందిరాల వద్ద ఎన్ని కల ప్రచారం నిర్వహించే వారిని గుర్తించి నోటీసులు జారీ చేయాలని సూచించారు. ఈనెల 30వ తేదీ సాయంత్రం 5 గంటల తర్వాత ఎన్నికల ప్రచారానికి అనుమతి లేదని స్పష్టం చేశారు. నిబంధనలను ఉల్లంఘించి ఎవరైనా ప్రచారం నిర్వహిస్తే వారిపై తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో మేయర్ స్థాన రిట ర్నింగ్ అధికారి, సెట్కూరు సీఈఓ డాక్టర్ వేణుగోపాల్, అదనపు కమి షనర్ ఆర్‌జీవీ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.