Share News

క్యాన్సర్‌ నియంత్రణకు అవగాహనే ఆయుధం

ABN , Publish Date - Feb 05 , 2026 | 12:23 AM

క్యాన్సర్‌ నియంత్రణకు అవగాహనే ప్రధాన ఆయుధమని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత అన్నారు.

క్యాన్సర్‌ నియంత్రణకు అవగాహనే ఆయుధం
వ్యాక్సిన కరపత్రాన్ని విద్యార్థికి అందిస్తున్న మంత్రి టీజీ భరత

మంత్రి టీజీ భరత

పారిశుధ్య కార్మికుల పిల్లలకు హెచపీవీ టీకాలు

కర్నూలు హాస్పిటల్‌, ఫిబ్రవరి 4(ఆంధ్రజ్యోతి): క్యాన్సర్‌ నియంత్రణకు అవగాహనే ప్రధాన ఆయుధమని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత అన్నారు. బుధవారం ప్రపంచ క్యాన్సర్‌ డేను పురస్కరించుకుని బచ్చు జానకీరాం ఫౌండేషన ఆధ్వర్యంలో నగరంలోని ఎస్‌బీఐ కాలనీ నగరపాలక సమావేశ భవనంలో పారిశుధ్య కార్మికుల పిల్లలకు హెచపీవీ క్యాన్సర్‌ నిరోధక టీకాలు పంపిణీ అవగాహన సదస్సును మంత్రి ప్రారంభించారు. ఆరోగ్యకరమైన జీవనశైలి, సమతుల ఆహారం, వ్యాయామం ద్వారా క్యాన్సర్‌ వ్యాధిని నయం చేయవచ్చునన్నారు. నగర మేయర్‌ మాట్లాడుతూ క్యాన్సర్‌పై అప్రమత్తంగా ఉండాలన్నారు. బచ్చు జానకీరాం పట్ల ఫౌండేషన వ్యవస్థాపకుడు సర్జికల్‌ అంకాలజిస్టు డా.బీ.రవీంద్రబాబు, నెఫ్రాలజిస్టు డా.సాయివాణి మాట్లాడుతూ వరల్డ్‌ క్యాన్సర్‌ డే సందర్భంగా పారిశుధ్య కార్మికుల పిల్లలకు ఒక్కొక్కటి రూ.2,500 విలువైన హెచపీవీ క్యాన్సర్‌ నిరోధక టీకాలను వేస్తున్నట్లు తెలిపారు. డా.రవీంద్రబాబు స్వయంగా పిల్లలకు హెచపీవీ క్యాన్సర్‌ ని రోధక టీకాలను వేశారు. నగరపాలక కార్పొరేషన కమిషనర్‌ విశ్వనాథ్‌, డిప్యూటీ కమిషనర్‌ సతీ్‌షకుమార్‌రెడ్డి, మున్సిపల్‌ హెల్త్‌ ఆఫీసర్‌ డా.నా గ ప్రసాద్‌, బొందిలీ కార్పొరేషన చైర్మన విక్రమ్‌ సింగ్‌ పాల్గొన్నారు.

Updated Date - Feb 05 , 2026 | 12:23 AM