హెచ్‌ఐవీపై అవగాహన కల్పించాలి
ABN , Publish Date - Aug 11 , 2026 | 10:51 PM
: హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌పై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించి, పరీక్షలు, కౌన్సెలింగ్, సకాలంలో చికిత్స పొందేలా ప్రజలను చైతన్య పరచాలని కలెక్టర్ రాజకుమారి అఽధికారులను ఆదేశించారు.
కలెక్టర్ రాజకుమారి
నంద్యాల నూనెపల్లి, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి) : హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌పై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించి, పరీక్షలు, కౌన్సెలింగ్, సకాలంలో చికిత్స పొందేలా ప్రజలను చైతన్య పరచాలని కలెక్టర్ రాజకుమారి అఽధికారులను ఆదేశించారు. సోమవారం ఆమె కలెక్టరేట్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆరోగ్య కరదీపికను డీఎంహెచ్‌ఓ డా. వెంకటరమణ, డిస్ర్టిక్ లెప్రసీ హెచ్‌ఐవీ, టీబీ కంట్రోల్ అధికారి శారదాబాయితో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా ఆగస్టు 12 నుంచి అక్టోబర్ 12 వరకు జిల్లాలో హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌పై ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.