Share News

మహిళా చట్టాలపై అవగాహన ఉండాలి

ABN , Publish Date - Feb 27 , 2026 | 12:32 AM

విద్యార్థినులకు మహిళా చట్టాలపై అవగాహన ఉండాలని డోన్‌ డీఎస్పీ శ్రీనివాస్‌ అన్నారు. గురువారం పట్టణంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థినులచే అవగాహన ర్యాలీ నిర్వహించారు.

మహిళా చట్టాలపై అవగాహన ఉండాలి
మాట్లాడుతున్న పోలీసు అధికారులు

విద్యార్థినులకు సూచించిన డీఎస్పీ శ్రీనివాస్‌

డోన్‌ టౌన్‌, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి): విద్యార్థినులకు మహిళా చట్టాలపై అవగాహన ఉండాలని డోన్‌ డీఎస్పీ శ్రీనివాస్‌ అన్నారు. గురువారం పట్టణంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థినులచే అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం పాతబస్టాండులో విద్యార్థినులకు మహిళా చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా డీఎస్పీ మాట్లాడుతూ బాలికలు ధైౖర్యంగా ఉండాలని, ఏ సమస్య వచ్చినా నిర్బయంగా ఎదుర్కోవాలని సూచించారు. మహిళలు, బాలికల రక్షణ కోసం ప్రభుత్వం, పోలీసులు కృషి చేస్తారని తెలిపారు. ఎవరైనా ర్యాగింగ్‌కు పాల్పడితే సంబందిత పోలీస్‌ స్టేషన్‌లో గానీ, పోలీసులకు గానీ ఫోన్‌ ద్వారా పిర్యాదు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ సీఐ ఇంతియాజ్‌ బాషా, ఎస్‌ఐ మమత తదితరులు ఉన్నారు.

Updated Date - Feb 27 , 2026 | 12:32 AM