Share News

హక్కుల గురించి బాలికలు అవగాహన పెంచుకోవాలి

ABN , Publish Date - Nov 05 , 2026 | 12:17 AM

సమాజంలో అన్యాయాలకు గురి కాకుండా ఉండాలంటే బాలికలు తమ హక్కులపై అవగాహన పెంచుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి. లీలా వెంకట శేషాద్రి తెలిపారు.

హక్కుల గురించి బాలికలు అవగాహన పెంచుకోవాలి
మాట్లాడుతున్న జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకట శేషాద్రి

కర్నూలు లీగల్‌, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): సమాజంలో అన్యాయాలకు గురి కాకుండా ఉండాలంటే బాలికలు తమ హక్కులపై అవగాహన పెంచుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి. లీలా వెంకట శేషాద్రి తెలిపారు. జాతీయ న్యాయ సేవాధికార చట్టం దినోత్సవం సందర్భంగా స్థానిక కలెక్టరేట్‌ సమీపంలోని బాలికల ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టల్‌లో న్యాయ అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలికలు చట్టాలపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. ఈ నెల 9వ తేదీన జరిగే న్యాయ సేవా దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ న్యాయ సేవాధికార చట్టంపై అవగాహన పెంచుకోవాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా ఆయన జాతీయ సేవా దినోత్సవం ప్రత్యేకతను, సైబర్‌ చట్టాలపై బాలికలకు అవగాహన కల్పించారు. ఆ తర్వాత బాలికల పోషకాహారంపై నిర్వహించిన వ్యాసరచన పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి. లీలా వెంకట శేషాద్రి సర్టిఫికెట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో లీగల్‌ సర్వీసెస్‌ మెంబర్‌ డా. రాయపాటి శ్రీనివాసులు, హాస్టల్‌ వార్డెన్లు బెన్నమ్మ, శైలజ పాల్గొన్నారు.

Updated Date - Nov 05 , 2026 | 12:18 AM