చట్టసభలపై అవగాహన కల్పించాలి
ABN , Publish Date - Jan 09 , 2026 | 12:14 AM
రాజ్యాంగ సంస్థలైన చట్టసభల పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించాలని రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేశ్ సూచించారు. బీజేపీ ఆధ్వర్యంలో గురువారం కేవీ సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో మాక్ పార్లమెంట్ నిర్వహించారు.
రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేశ్
కర్నూలు ఎడ్యుకేషన్, జనవరి 8 (ఆంధ్రజ్యోతి): రాజ్యాంగ సంస్థలైన చట్టసభల పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించాలని రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేశ్ సూచించారు. బీజేపీ ఆధ్వర్యంలో గురువారం కేవీ సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో మాక్ పార్లమెంట్ నిర్వహించారు. చట్టసభలంటే రాజకీయ నాయకులు ఒకరిపై మరొకరు విమర్శించుకునేవారనే అభిప్రాయం ఉందని, కేవలం చర్లల్లో మాత్రమే అలా ఉంటుందన్నారు. చర్చల అనంతరం సభ్యులు కలిసిమెలిసి ఉంటారన్నారు. పార్లమెంట్ స్టాండింగ్ కమిటీలో అన్ని పార్టీలకు చెందిన 35 మంది సభ్యులు ఉంటారనీ, వారందరు కలిసి చర్చించిన అనంతరం బిల్లులు తయారు చేసి పార్లమెంటు ఆమోదం కొరకు పంపుతారన్నారు. ఆర్టికల్ 370 కారణంగా కశ్మీర్ భారత్‌లో ఉన్నా, పౌరులు అక్కడ స్థలం కొనడానికి అవకాశం ఉండేది కాదని, దాన్ని రద్దుచేయడంతో హక్కులు వచ్చాయన్నారు. ప్రపంచంలోని అన్ని రాజ్యాంగాలకన్నా భారత రాజ్యాంగం గొప్పదన్నారు. ఈ కార్యక్రమంలో విద్యాసంస్థల చైర్మన్ కేవీ సుబ్బారెడ్డి, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గీతామాధురి పాల్గొన్నారు.