వలసలు నివారించండి
ABN , Publish Date - Feb 26 , 2026 | 12:10 AM
గ్రామాల్లో వ్యవ సాయ పనులు పూర్తవుతుండటం వల్ల వ్యవసాయ కూలీలు, రైతులు జీవ నోపాధి కోసం వలసలు వెళ్లే పరిస్థితులు ఉన్నాయని, వెంటనే ఆయా గ్రామాల్లో ఉపాధి హామీ పథకం కింద పనులు చేపట్టాలని కలెక్టర్ డా.ఏ. సిరి నీటి యాజమాన్య సంస్థ, పంచాయతీరాజ్ శాఖ అధికారులతో పాటు వివిధ విభాగాల అధికారులను ఆదేశించారు.
ఉపాధి హామీ పనులను పూర్తి చేయండి
కలెక్టర్ డా.సిరి ఆదేశాలు
కర్నూలు అగ్రికల్చర్, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో వ్యవ సాయ పనులు పూర్తవుతుండటం వల్ల వ్యవసాయ కూలీలు, రైతులు జీవ నోపాధి కోసం వలసలు వెళ్లే పరిస్థితులు ఉన్నాయని, వెంటనే ఆయా గ్రామాల్లో ఉపాధి హామీ పథకం కింద పనులు చేపట్టాలని కలెక్టర్ డా.ఏ. సిరి నీటి యాజమాన్య సంస్థ, పంచాయతీరాజ్ శాఖ అధికారులతో పాటు వివిధ విభాగాల అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో ఉపాధి హామీ పథకం కింద జరుగుతున్న పనుల పురోగతి, యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే, అక్షరాంధ్ర తదితర అంశాలపై జిల్లా అధికారులు, మండల స్థాయి అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఉపాధి హామీ పథకం కింద జిల్లాలో మొత్తం 704 పనులు రూ.72.69 కోట్ల అంచనాతో మంజూరయ్యాయని, ఇందులో 634 పనులు ఇప్పటికే ప్రారం భించారని, ఇంకా 70 పనులు ప్రారంభం కావాల్సి ఉందని తెలిపారు. ఆ ప నులను వెంటనే శనివారంలోపు మొదలు పెట్టాలని పంచాయతీరాజ్ ఎస్‌ఈని ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో అక్షరాస్యత విభాగం పీడీ చంద్రశేఖర్ రెడ్డి, డ్వామా పీడీ మాధవి తదితరులు పాల్గొన్నారు.