కల్తీ విత్తనాలు నివారించండి
ABN , Publish Date - Apr 28 , 2026 | 11:47 PM
వచ్చే ఖరీఫ్ సీజన్‌లో వివిధ పంటల సాగుకు నాసిరకం, కల్తీ విత్తనాలను రైతులకు దళారులు, వ్యాపారులు అంటగట్టకుండా చర్యలు తీసుకోవాలని వ్యవ సాయ శాఖ జేడీ వరలక్ష్మి మంగళవారం తెలిపారు.
కమిషనర్ ఆదేశాలతో జిల్లా అంతటా తనిఖీలు
కర్నూలు అగ్రికల్చర్, ఏప్రిల్ 28(ఆంధ్రజ్యోతి): వచ్చే ఖరీఫ్ సీజన్‌లో వివిధ పంటల సాగుకు నాసిరకం, కల్తీ విత్తనాలను రైతులకు దళారులు, వ్యాపారులు అంటగట్టకుండా చర్యలు తీసుకోవాలని వ్యవ సాయ శాఖ జేడీ వరలక్ష్మి మంగళవారం తెలిపారు. కల్లూరు మండలంలో ని లక్ష్మీపురంలో శ్రీరామ అగ్రిజెనిటిక్స్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ కంపెనీలో 14 పత్తి విత్తనాలు సంచుల్లోని విత్తనాలపై హెచ్‌టీ టెస్టులు చేయగా.. 14 నెగిటివ్ రిజల్ట్స్ వచ్చాయని, అదే విధంగా శ్రీరామ్ సీడ్స్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీలో 20 పత్తి విత్తనాల సంచుల్లో విత్తనాలను పరీక్షించగా.. అదే మొత్తంలో నెగిటివ్ ఫలితాలు వచ్చాయని కర్నూలు వ్యవసాయ శాఖ ఏడీఏ శాలురెడ్డి తెలిపారు. ఈ తనిఖీలో విజయవాడ కమిషనరేట్ నుంచి ఏడీఏ ప్రవీణ్, ఏవో మోహన్ కుమార్, ఆగ్రోనమిస్టు ఏడీఏ రాజశేఖర్, కల్లూరు మండల వ్యవసాయాధికారి విష్ణువర్దన్ రెడ్డి పాల్గొన్నారు.