రాయితీలను వినియోగించుకోండి
ABN , Publish Date - Nov 18 , 2026 | 11:38 PM
రైతులకు ఉద్యాన శాఖ ద్వారా అందిస్తున్న రాయితీ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రాజకుమారి రైతులకు సూచించారు.
రైతులు సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకోవాలి
కలెక్టర్ రాజకుమారి
ఆళ్లగడ్డ, నవంబరు 18(ఆంధ్రజ్యోతి):. రైతులకు ఉద్యాన శాఖ ద్వారా అందిస్తున్న రాయితీ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రాజకుమారి రైతులకు సూచించారు. బుధవారం ఆళ్లగడ్డ మండలం శాంతి నగరం గ్రామంలోని ఆర్.కే. నేజర్ ఫార్మను కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆక్కడ సాగుచేస్తున్న డ్రాగన్ ఫ్రూట్ పంటను, ఉద్యాన వన శాఖ ద్వారా రైతులు ఆర్. లక్ష్మీ శ్రావణి ఆర్ నాగపద్మ దంపతులకు సబ్సిడీపై అందించిన సోలార్ కోల్ట్ రూం, సోలార్ డ్రైయర్ యునిట్లను ఆమె పరిశీలించారు. ఈ పరికరాలను రైతులకు ఏవిధంగా ఉపయోగపడుతున్నదీ అడిగి తెలుసుకొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఉద్యాన వన పంటలు సాగు చేస్తున్న రైతులు తమకు అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని సూచించారు. పండ్లు, కూరగాయలను నిల్వ చేసి విలువ అధారిత ఉత్పత్తులుగా తయారు చేసి సరైన మార్కెట్ బ్రాండింగ్ ద్వారా అధిక లాభాలు పొందాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యాన వన శాఖ అధికారి నాగరాజు, డివిజన్ ఏడీ విజయ్‌శేఖర్, ఏఓ కిషోర్‌కుమార్‌రెడ్డి, ఉద్యాన వన అధికారి దస్తగిరి, రైతులు పాల్గొన్నారు.