బిందు సేద్యంలో ఆటోమేషన్
ABN , Publish Date - Mar 02 , 2026 | 11:34 PM
బిందు సేద్యంలో ఆటోమేషన్ సాంకేతికత రైతులకు ఎంతో మేలు చేస్తుందని జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ తెలిపారు.
కర్నూలు కలెక్టరేట్, మార్చి 2 (ఆంధ్రజ్యోతి): బిందు సేద్యంలో ఆటోమేషన్ సాంకేతికత రైతులకు ఎంతో మేలు చేస్తుందని జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ తెలిపారు. కలెక్టరేట్ సునయన ఆడిటో రియంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఆధునిక సాగు ఆటోమేషన్ పథకం పోస్టర్‌ను జేసీ ఆవిష్కరించారు. ఈ సంద ర్భంగా జేసీ నూరుల్ ఖమర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యాన వన శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కింద జిల్లాలోని రైతులకు సాగునీటి నిర్వహణను సులభతరం చేసేందుకు ఆధునిక సాగు - ఆటోమేషన్ పథకాన్ని ప్రవేశ పెట్టిందన్నారు.. ఆటోమేషన్ వ్యవస్థ ద్వారా రైతులు ప్రతి నీటి బొట్టును సమర్థవంగా వినియో గించుకోవచ్చన్నారు. ఈ పథకం కింద చిన్న, సన్నకారు రైతులకు 5 శాతం రాయితీ, ఇతర రైతులకు 45 శాతం రాయితీ వరిస్తుందన్నారు. కార్యక్రమంలో డీఆర్వో వెంకట నారాయణమ్మ, హౌసింగ్ పీడీ చిరంజీవి, ఏపీఎంఐపీ పీడీ శ్రీనివాసులు పాల్గొన్నారు.