ఎద్దుపై వేట కొడవళ్లతో దాడి
ABN , Publish Date - May 21 , 2026 | 12:06 AM
మూగజీవిపై వేటకొడవళ్లతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన మండలంలో తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన బుధవారం జరిగింది. ఆరో వార్డులో నివసిస్తున్న రైతు సాతనూరు నాగరాజుకు చెందిన లక్ష రూపాయల విలువైన భారీ ఎద్దుపై గుర్తు తెలియని వ్యక్తులు వేటకొడవళ్లతో కిరాతకంగా దాడిచేసి రక్తగాయాల పాలు చేశారు
గుర్తు తెలియని వ్యక్తుల కర్కశత్వం
పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు
కోసిగి, మే 20 (ఆంధ్రజ్యోతి): మూగజీవిపై వేటకొడవళ్లతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన మండలంలో తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన బుధవారం జరిగింది. ఆరో వార్డులో నివసిస్తున్న రైతు సాతనూరు నాగరాజుకు చెందిన లక్ష రూపాయల విలువైన భారీ ఎద్దుపై గుర్తు తెలియని వ్యక్తులు వేటకొడవళ్లతో కిరాతకంగా దాడిచేసి రక్తగాయాల పాలు చేశారు. నాగరాజు ప్రతిరోజూలాగే మంగళవారం రాత్రి కోసిగి సమీపంలోని క్యాతప్పకొండ దగ్గర ఉన్న తన పొలం గుడిసెలో రెండు ఎద్దులను కట్టేసి ఇంటికి వెళ్లారు. బుధవారం తెల్లవారుజామున తిరిగి పొలానికి వెళ్లి చూడగా, అక్కడ ఒక ఎద్దు మాత్రమే ఉంది. ఆందోళనతో చుట్టుపక్కల వెతకగా... గుడిసెకు ఐదు పొలాల దూరంలో మరో ఎద్దు తీవ్ర రక్తగా యాలతో నడవలేని స్థితిలో కిందపడిపోయి కనిపించింది. ఆ దృశ్యాన్ని చూసి రైతు నాగరాజు అక్కడే గుండెపగిలేలా రోదిం చారు. దుండగులు ఎద్దును గుడిసె నుంచి బయటకు లాక్కెళ్లి, రాళ్లతో కొట్టడమేగాకుండా వేటకొడవళ్లతో కడుపు, కాళ్లు, భుజం, ముఖంపైన విచక్షణారహితంగా నరికారు. ఎద్దు నడవలేక ప్రాణాపాయస్థితిలోకి వెళ్లిపోయింది. ఈ ఘటన స్థానిక రైతులను కలిచివేసింది. రైతు నాగరాజు బుధవారం కోసిగి పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌ఐ రమేష్‌రెడ్డికి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు.