Share News

వైసీపీని వీడిన ఆత్మకూరు ఎంపీపీ

ABN , Publish Date - Jun 18 , 2026 | 11:40 PM

శ్రీశైల నియోజకవర్గ కేంద్ర బిందువైన ఆత్మకూరులో వైసీపీకి బిగ్‌ షాక్‌ తగిలింది. ఆపార్టీకి చెందిన ఆత్మకూరు ఎంపీపీ తిరుపాలమ్మ వైసీపీని వీడి శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకుంది.

వైసీపీని వీడిన ఆత్మకూరు ఎంపీపీ
ఎమ్మెల్యే బుడ్డా సమక్షంలో టీడీపీలోకి చేరిన ఎంపీపీ తిరుపాలమ్మ

ఎమ్మెల్యే బుడ్డా సమక్షంలో టీడీపీలో చేరిక

ఆత్మకూరు, జూన్‌ 18(ఆంధ్రజ్యోతి): శ్రీశైల నియోజకవర్గ కేంద్ర బిందువైన ఆత్మకూరులో వైసీపీకి బిగ్‌ షాక్‌ తగిలింది. ఆపార్టీకి చెందిన ఆత్మకూరు ఎంపీపీ తిరుపాలమ్మ వైసీపీని వీడి శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకుంది. స్థానిక ఆర్‌ఆర్‌ ఫంక్షన్‌హాల్‌లో గురువారం ఎంపీపీ తిరుపాల మ్మకు ఎమ్మెల్యే బుడ్డా టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆమెతో పాటు మండ లంలోని వెంకటాపురం, కరివేన గ్రామాలకు చెందిన సుమారు 150 కుటుంబాలు వైసీపీని నుంచి టీడీపీలోకి చేరాయి. ఎంపీపీ తిరుపాలమ్మ మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి అహంకార పూరిత విధానాలపై విసుగు చెంచడంతో పాటు ఎమ్మెల్యే బుడ్డా నియోజక వర్గంలో చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితులమై పార్టీలో చేరినట్లు వెల్లడించారు. నియోజకవర్గంలోని ఆయా గ్రామాలకు చెందిన సుమారు 51 మంది లబిఽ్ధదారులకు రూ.30లక్షల సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కులను ఎమ్మెల్యే బుడ్డా పంపిణీ చేశారు. సీఎంఆర్‌ఎఫ్‌ ఎంతో మంది పేదలకు వరంలా నిలిచిందని గుర్తుచేశారు.

Updated Date - Jun 18 , 2026 | 11:40 PM