Share News

అర్హులందరికీ భరోసా పింఛన్లు

ABN , Publish Date - Sep 12 , 2026 | 12:22 AM

అర్హులందరికీ ఎన్టీఆర్‌ భరోసా పింఛన్లను అందించాలని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు.

అర్హులందరికీ భరోసా పింఛన్లు
మాట్లాడుతున్న ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి

ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి

కల్లూరు, సెప్టెంబరు 11(ఆంధ్రజ్యోతి): అర్హులందరికీ ఎన్టీఆర్‌ భరోసా పింఛన్లను అందించాలని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు. శుక్రవారం మాధవీనగర్‌ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో టీడీపీ సీనియర్‌ నాయకుడు గౌరు వెంకటరెడ్డితో కలిసి పాణ్యం పరిఽ దిలోని 4 మండలాలు, 16 వార్డుల టీడీపీ నాయకులు, కార్యకర్తలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. గౌరు చరితారెడ్డి మాట్లాడుతూ అర్హులంతా ఎన్టీఆర్‌ భరోసా పింఛన్లకు దరఖాస్తు చేసుకునేలా అవగా హన కల్పించాలన్నారు. వార్డు ఇనచార్జిలు, గ్రామ నాయకులు, క్లస్టర్‌, బూత, యూనిట్‌ ఇనచార్జిలు పాల్గొన్నారు.

ఫ ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు చిత్తశుద్ధితో పని చేయాలని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు. శుక్రవారం మాధవీ నగర్‌ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆమె గ్రీవెన్స నిర్వహించి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.

ఫ రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని పాణ్యం ఎమ్మెల్యే గౌరుచరితారెడ్డి అన్నారు. శుక్రవారం కల్లూరు మండ లం పర్ల, పెద్దపాడు గ్రామాల్లో ఎమ్మెల్యే పర్యటించారు. పర్ల గ్రామంలో రీసర్వేలో భాగంగా పట్టా భూములను తప్పుగా ఎండోమెంట్‌ భూమిగా వెబ్‌ల్యాండ్‌లో నమోదు చేశారు. నూతన పట్టాదారు పాసు పుస్తకాలను 80 మంది రైతులకు ఎమ్మెల్యే అందజేశారు.

ఫ పెద్దపాడులో గ్రామం కంఠంలో ఇళ్లు నిర్మించుకుని నివాస ముంటున్న లబ్ధిదారులకు ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి పొజిషన సర్టిఫి కెట్లు అందజేశారు. కొంతకాలంగా ప్రభుత్వ, నగరపాలక సంస్థ సేవలు అందుకోవడంలో అవస్థలు పడుతున్న వారికి స్థలహక్కు పత్రా లు పంపిణీ చేశారు. కల్లూరు తహసీల్దారు కె.ఆంజనేయులు, టీడీపీ 36వ వార్డు ఇనచార్జి రెడ్డిగారి తిరుమలేశ్వరరెడ్డి, క్లస్టర్‌ ఇనచార్జి ఆర్‌. లోకేశ్వ రరెడ్డి, టి.శేఖర్‌, బీచుపల్లి, దేవులంకాటి శేఖర్‌, రామగిడ్డయ్య, రామాం జనేయులు, శేషన్న, మహానంది, సర్వే డీటీ.జయశ్రీ పాల్గొన్నారు.

Updated Date - Sep 12 , 2026 | 12:22 AM