రోడ్డు ప్రమాదంలో ఏఎస్‌ఐ దుర్మరణం
ABN , Publish Date - Jul 05 , 2026 | 11:58 PM
కారు టైరు పంచర్ కావడంతో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏఎస్‌ఐ దుర్మరణం చెందాడు.
పంచరైన కారు టైరు
పాణ్యం మండలం తమ్మరాజుపల్లె వద్ద ఘటన
హెడ్ కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలు
క్షతగాత్రులను శాంతిరాం ఆస్పత్రికి తరలింపు
పాణ్యం, జూలై 5 (ఆంధ్రజ్యోతి) : కారు టైరు పంచర్ కావడంతో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏఎస్‌ఐ దుర్మరణం చెందాడు. ఈ ఘటన పాణ్యం మండలంలోని తమ్మరాజులపల్లె సమీపంలో ఆదివారం చోటుచేసుకున్నట్లు ఎస్‌ఐ నరేంద్రకు మార్‌రెడ్డి తెలిపారు. వివరాలు.. ఆళ్లగడ్డ రూరల్ పోలీసుస్టేషన్‌లో చిట్టెపు సురేష్‌రెడ్డి (56) ఏఎస్‌ఐగా పనిచేస్తున్నారు. కర్నూలు నుంచి నంద్యాలకు కారులో వెళ్తున్నా రు. కారు ముందు టైరు పగిలి అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొంది. ఈప్రమాదంలో సురేష్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు. నంద్యాల రెండో పట్టణ పోలీసుస్టేషన్ హెడ్‌కానిస్టేబుల్ నాగేంద్రరెడ్డి, కుటుంబ సభ్యులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను హుటాహుటిన శాంతిరాం ఆస్పత్రికి తరలించారు. సురేష్‌రెడ్డి మహానంది మండలం మసీదుపురం నివాసి. ఆయనకు భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. 1993 బ్యాచ్‌కి చెందిన సురేష్‌రెడ్డి కర్నూలు, నంద్యాల, ఆళ్లగడ్డ ప్రాంతాల్లో విధులు నిర్వహించారు. 2009 నుంచి 2014వరకు పాణ్యంలో హెడ్ కానిస్టేబుల్‌గా, అనంతరం ఎస్‌బీ కానిస్టేబుల్‌గా, ప్రస్తుతం ఆళ్లగడ్డ రూరల్ పోలీసుస్టేషన్‌లో ఏఎస్‌ఐగా పనిచేస్తున్నారు. సమాచారం తెలిసిన వెంటనే సంఘట నా స్థలాన్ని పాణ్యం సీఐ కిరణ్‌కుమార్‌రెడ్డి పరిశీలించి మృతదేహాన్ని నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని ద ర్యాప్తు చేపట్టారు.