గొర్రెలకు మేతగా..
ABN , Publish Date - Jul 23 , 2026 | 12:32 AM
మండలంలోని ప్యాలకుర్తికి చెందిన ఓ రైతు చౌళకాయ పంటను గొర్రెలకు మేతగా వదిలేశాడు.
కోడుమూరు రూరల్, జూలై 22(ఆంధ్రజ్యోతి): మండలంలోని ప్యాలకుర్తికి చెందిన ఓ రైతు చౌళకాయ పంటను గొర్రెలకు మేతగా వదిలేశాడు. గ్రామానికి చెందిన ఖాజా మోదీన అనే రైతు ఎనిమిది ఎకరాల్లో చౌళకాయ సాగు చేశాడు. తీవ్ర వర్షాభావం కారణంగా పంటకు వైరస్ సోకి కోతకు రాలేదు. దీంతో బుధవారం రైతు పంటను గొర్రెలకు వదిలేశాడు. అనంతరం ట్రాక్టర్‌తో దున్నేశాడు. సేద్యం, విత్తులు, కలుపులు, మందులు, పిచికారీ వంటి వాటికి ఎకరాకు రూ. 30 వేలు నష్టపోయినట్లు రైతు వాపోయాడు.