ఆర్యవైశ్యులు అన్నిరంగాల్లో రాణించాలి
ABN , Publish Date - Mar 30 , 2026 | 12:39 AM
: ఆర్యవైశ్యులు అన్నిరంగాల్లో రాణించాలని రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేశ అన్నారు
రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేశ
కర్నూలు కల్చరల్, మార్చి 29 (ఆంధ్రజ్యోతి): ఆర్యవైశ్యులు అన్నిరంగాల్లో రాణించాలని రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేశ అన్నారు. ఆదివారం నగరంలోని సోమిశెట్టి విశ్వ గార్డెన్స సమావేశ హాలులో ఆర్యవైశ్య మహాసభ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన టీజీ వెంకటేశ మాట్లాడారు. ఆర్యవైశ్య మహాసభ అభివృద్ధికి ప్రతిఒక్కరూ కృషిచేయాలన్నారు. ఆర్యవైశ్య మహాసభ తాజా మాజీ అధ్యక్షుడు చిన్ని రామ సత్యనారాయణ అధ్యక్షత ఈసభ జరిగింది. ఇటీవల ఆంధ్రప్రదేశ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష ఎన్నికల్లో ఎన్నికల అధికారిగా వ్యవహరించిన పెనుగొండ సుబ్బర యు డు ఏపీ ఆర్యవైశ్య మహాసభకు నూతన అధ్యక్షుడిగా కర్నూలుకు చెందిన ఇల్లూరు ల క్ష్మయ్యను ఎన్నికైనట్లు సర్వసభ్య సమావేశంలో ప్రకటించారు. ఆయనకు పెనుగొండ సుబ్బ రాయుడు డిక్లరేషన పత్రం అందజేశారు. కుడా చైౖర్మన సోమిశెట్టి వెంకటేశ్వర్లు, మాజీ అధ్యక్షుడు నాగబాబు, వాసవి సత్ర సముదాయాల అధ్యక్షుడు దేవకి వెంకటేశ్వర్లు, సిద్ధ నాగేశ్వరరావులతోపాటూ పలు జిల్లాల ఆర్యవైశ్య సంఘాల అధ్యక్షులు పాల్గొన్నారు.