Share News

మల్లన్నకు ఆరుద్ర నక్షత్ర పూజలు

ABN , Publish Date - Jan 30 , 2026 | 11:18 PM

శ్రీశైల మల్లన్నకు ఆరుద్ర నక్షత్ర పూజలు శాస్త్రోక్తంగా జరిపించినట్లు ఈవో శ్రీనివాసరావు తెలిపారు.

 మల్లన్నకు ఆరుద్ర నక్షత్ర పూజలు
స్వర్థరథాన్ని ముందుకు లాగుతున్న ధర్మకర్తలు

స్వర్ణరథంపై దర్శనమిచ్చిన ఆది దంపతులు

శ్రీశైలం, జనవరి 30 (ఆంధ్రజ్యోతి): శ్రీశైల మల్లన్నకు ఆరుద్ర నక్షత్ర పూజలు శాస్త్రోక్తంగా జరిపించినట్లు ఈవో శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం తెల్లవారుజామున స్వామివారికి మహన్యాసపూర్వక ఏకదశ రుద్రాభిషేకం, అన్నాభిషేకం, బిల్వార్చనలు చేశారు. అనంతరం గంగాధర మండపం రథశాల వద్ద స్వర్ణరథంపై స్వామిఅమ్మవార్లను ఊరేగించారు. ఆలయ ధర్మకర్తల మండలి చైౖర్మెన్‌ పోతుగుంట రమేష్‌నాయుడు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 30 , 2026 | 11:18 PM