సునీల్‌పై దాడిచేసిన వారిని అరెస్టు చేయాలి
ABN , Publish Date - Jan 14 , 2026 | 11:47 PM
సోషల్ మీడియా కార్యకర్త పడాల సునీల్‌పై దాడిచేసినవారు, కారకులపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని రాయలసీమ మాల సంఘాల జేఏసీ చైర్మన్ మాట ఓబులేసు డిమాండ్ చేశారు.
కలెక్టరేట్ వద్ద మాల మహానాడు ధర్నా
కర్నూలు, జనవరి 14 (ఆంధ్రజ్యోతి): సోషల్ మీడియా కార్యకర్త పడాల సునీల్‌పై దాడిచేసినవారు, కారకులపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని రాయలసీమ మాల సంఘాల జేఏసీ చైర్మన్ మాట ఓబులేసు డిమాండ్ చేశారు. బుధవారం కలెక్టరేట్ గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేశారు. టీడీపీ నాయకుడికి వ్యతిరేకంగా సోషల్ మీడి యాలో పోస్టు పెట్టడంతోనే దాడి చేయించారని ఆరోపించారు. దాడి జరిగి మూడు రోజులైనా పోలీసులు ఇంతవరకు నిందితులను గుర్తించ లేదన్నారు. మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. నర్సప్ప, జిల్లా ప్రధాన కార్యదర్శి పేరుకుల మునిస్వామి, మాధవస్వామి మాట్లాడుతూ నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి, పడాల సునీల్‌కు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. న్యాయవాది ఆనంద్, పట్టణ అధ్యక్షుడు సందీప్ కుమార్ పాల్గొన్నారు.
మంత్రి భరత్‌పై అసత్య ఆరోపణలు మానుకోవాలి
పడాల సునీల్‌పై దాడి విషయంలో మంత్రి టీజీ భరత్‌పై మాల మహానాడు నాయకులు అసత్య ఆరోపణలు చేయడం సరికాదని కర్నూలు కార్పొరేటర్ క్రాంతి, టీడీపీ ఎస్సీ సెల్ విభాగం నాయకులు పామన్న, సుంకన్న, ఏసన్న పేర్కొన్నారు. బుధవారం మంత్రి కార్యాల యంలో మాట్లాడుతూ సునీల్ టీడీపీ సోషల్ మీడియా ఇన్‌చార్జిగా పనిచేసి, సస్పెండ్ అయ్యారని, నాలుగేళ్ల క్రితమే పార్టీ బహిష్కరించిం దన్నారు. అనంతరం సునీల్ టీడీపీ నాయకులకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ వస్తున్నారని తెలిపారు. పాల్‌రాజ్, మాధవస్వామి, మోహన్, ప్రభాకర్, చిన్నమ్మి పాల్గొన్నారు.