యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు
ABN , Publish Date - Oct 24 , 2026 | 12:42 AM
నగర పాలక సంస్థ ఎన్నికల నిర్వహణలో భాగంగా కౌంటింగ్ కేంద్రం వద్ద అవస రమైన ఏర్పాట్లను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తున్నట్లు అడిషనల్ ఎలక్షన అథారిటీ, కమిషనర్ చల్లా ఓబులేసు తెలిపారు.
అడిషనల్ ఎలక్షన అథారిటీ, కమిషనర్ చల్లా ఓబులేసు
కర్నూలు న్యూసిటీ, అక్టోబరు 22(ఆంధ్రజ్యోతి): నగర పాలక సంస్థ ఎన్నికల నిర్వహణలో భాగంగా కౌంటింగ్ కేంద్రం వద్ద అవస రమైన ఏర్పాట్లను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తున్నట్లు అడిషనల్ ఎలక్షన అథారిటీ, కమిషనర్ చల్లా ఓబులేసు తెలిపారు. శుక్రవారం నగర శివారు లోని అథెనా పాఠశాలలో ఏర్పాటు చేస్తున్న కౌంటింగ్ కేంద్రాన్ని ఆయన సందర్శించి, పార్కింగ్, రిసెప్షన, పోలింగ్ సామగ్రి పంపిణీ, స్వీకరణకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. అనం తరం సా్ట్రంగ్ రూమ్, ఓట్ల లెక్కింపు గదులు, అధికారుల రాకపోకల వాహనాల పార్కింగ్ తదితర అంశాలను సమీక్షించారు. కార్యక్రమం లో ఎంఈలు మనోహర్‌రెడ్డి, గిరిరాజు, డీసీపీ శభ్నం శాసి్త్ర, డీఈ ఈలు పవనకుమార్‌రెడ్డి, శ్రీనివాసన, నరేష్ తదితరులు పాల్గొన్నారు.