విద్యార్థి బస్సు ఏర్పాటు చేయాలి
ABN , Publish Date - Jul 14 , 2026 | 11:31 PM
కొణిదేల గ్రామానికి చెందిన విద్యార్థులు తమకు విద్యార్థి బస్సు ఏర్పాటు చేయాలంటూ మంగళవారం ఆంధ్ర విద్యార్థి సంఘం కార్యదర్శి నాగరాజు ఆధ్వర్యంలో నందికొట్కూరు ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఆందోళన చేపట్టారు.
నందికొట్కూరు, జూలై 14 (ఆంధ్రజ్యోతి) : కొణిదేల గ్రామానికి చెందిన విద్యార్థులు తమకు విద్యార్థి బస్సు ఏర్పాటు చేయాలంటూ మంగళవారం ఆంధ్ర విద్యార్థి సంఘం కార్యదర్శి నాగరాజు ఆధ్వర్యంలో నందికొట్కూరు ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఆందోళన చేపట్టారు. నాగరాజు మాట్లాడుతూ నెహ్రూనగర్ నుంచి వచ్చే ఆర్టీసీబస్సు స్టాండింగ్‌తో ప్రయాణికులు వస్తున్నా రన్నారు. కొణిదేల గ్రామంలో 50 మంది విద్యార్థులు అదే బస్సులో ప్రయాణం చేసేందుకు నానా ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. నాలుగు రోజులుగా వివిధ రూపాల్లో కొణిదేల గ్రామానికి చెందిన విద్యార్థులు ఆందోళన చేస్తున్నా డిపో మేనేజర్ స్పందించడం లేదన్నారు. వినతిపత్రాలు ఇచ్చినా, పోలీసులతో చెప్పించినా డిపోమేనేజర్ నజీర్ అహ్మద్ నుంచి ఎలాంటి స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే నేడు ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఆందోళన చేపట్టామన్నారు. మరో రెండు రోజుల్లో కొణిదేల గ్రామానికి ప్రత్యేక విద్యార్థి బస్సును ఏర్పాటు చేయాలన్నారు. లేనిపక్షంలో తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టాడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు, విద్యార్థి సంఘం నాయకుడు డక్కా కుమార్ పాల్గొన్నారు.