కౌంటింగ్ కేంద్రం వద్ద చురుగ్గా ఏర్పాట్లు
ABN , Publish Date - Oct 27 , 2026 | 12:22 AM
నగర పాలక సంస్థ ఎన్నికల నిర్వహణలో భాగంగా కౌంటింగ్ కేంద్రం వద్ద చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయని అడిషనల్ ఎలక్షన అథారిటీ, కమిషనర్ చల్లా ఓబులేసు తెలిపారు.
అడిషనల్ ఎలక్షన అథారిటీ, కమిషనర్ చల్లా ఓబులేసు
కర్నూలు న్యూసిటీ, అక్టోబరు 26(ఆంధ్రజ్యోతి): నగర పాలక సంస్థ ఎన్నికల నిర్వహణలో భాగంగా కౌంటింగ్ కేంద్రం వద్ద చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయని అడిషనల్ ఎలక్షన అథారిటీ, కమిషనర్ చల్లా ఓబులేసు తెలిపారు. సోమవారం నగర శివారులోని అథెనా పాఠశాల మైదానంలో ఏర్పాటు చేస్తున్న కౌంటింగ్ కేంద్రాన్ని ఆయన సందర్శించారు. చల్లా ఓబులేసు మాట్లాడుతూ పోలింగ్ సామగ్రి పంపిణీ, స్వీకరణ ప్రక్రియ సజావుగా జరిగేలా అవసరమైన ఏర్పాట్లును పక్కాగా పూర్తి చేస్తున్నామన్నారు. ఎన్నికల విధులకు హాజరయ్యే అధికారులు, సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు కలగ కుండా తగిన మౌలిక సదుపాయాలు కల్పిం చేందుకు చర్యలు చేపడుతున్నామని, సా్ట్రంగ్ రూమ్‌లో బ్యాలెట్ బాక్సుల భద్రతకు పటి ష్టమైన చర్యలు చేపడుతున్నామని అన్నారు. కార్యక్రమంలో ఎంఈ మనోహర్‌రెడ్డి, డీఈఈలు నరేష్, పవనకుమార్‌రెడ్డి, ఏఈలు జనార్దన, ప్రవీణ్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు.