చురుగ్గా ఏర్పాట్లు
ABN , Publish Date - Sep 19 , 2026 | 11:57 PM
కర్నూలులో ఈనెల 22న వినాయక నిమజ్జనానికి సర్వం సిద్ధం చేస్తున్నారు.
కేసీ కాలువ, హంద్రీనీవాలో నిమజ్జనానికి సన్నాహాలు
మంత్రి టీజీ భరత్ ప్రత్యేక దృష్టి
కేసీ కెనాల్‌ను సుందరంగా తీర్చిదిద్దిన అధికారులు
శభాష్.. అంటూ ఎక్స్ వేదికగా మంత్రి లోకేశ్ ప్రశంసలు
కర్నూలు, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): కర్నూలులో ఈనెల 22న వినాయక నిమజ్జనానికి సర్వం సిద్ధం చేస్తున్నారు. ఎల్‌నినో ప్రభావంతో తుంగభద్ర నది ఎండి పోయినా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా గణేశ్ మహోత్సవ కేంద్ర సమితి, భక్తుల ఆకాంక్షలకు అనుగుణంగా కేసీ కాలువ వినాయక ఘాట్‌లో నిమజ్జన ఏర్పాట్లు చేస్తు న్నారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, కలెక్టర్ ఏ.సిరి వినాయక నిమజ్జనంపై పలుమార్లు నగరపాలక, జలవనరులు శాఖలు సహా వివిధ శాఖల అధికారులు, గణేశ్ మహోత్సవ సమితి సభ్యులతో సమీక్షలు నిర్వహించారు. ఎల్‌నినో ప్రభావంతో తుంగభద్ర నది ఎండిపోవడం, వరద లేక కేసీ కాలువ ఒట్టిపోయింది. సుంకేసుల డ్యాంలో ఉన్న అరకొర నీరు నగర ప్రజల తాగు నీటి అవసరాలకే సరిపోవడం లేదు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో నిమజ్జనానికి కేసీ కా లువకు నీటిని విడుదల చేయడం లేని పరిస్థితి ఉంది. ప్రత్యామ్నాయంగా నన్నూరు టోల్‌ప్లాజా, తడకనపల్లె, ఉల్లిందకొండ సమీపంలోని హంద్రీనీవా కాలువలో నిమ జ్జనం చేసేలా అధికారులు ఏర్పాట్లు చేపట్టారు. నాలుగు దశాబ్దాలుగా కేసీ కెనాల్ వినాయక ఘాట్‌లోనే నిమజ్జనోత్సవాలను నిర్వహిస్తున్నాం, ఈ ఏడాది కూడా ఇక్కడే నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని గణేశ్ మహోత్సవ కేంద్ర సమితి సభ్యులు పట్టుబ ట్టారు. వారి ఆకాంక్ష మేరకు కేసీ కెనాల్ వినాయక ఘాట్‌లో 600 మీటర్లు పొడవులో 6-9 అడుగులు ఎత్తులో నీళ్లు నిల్వ చేస్తామని మంత్రి టీజీ భరత్ హామీ ఇచ్చారు. మంత్రి భరత్ ఆదేశాల మేరకు నగరక పాలక సంస్థ కమిషన్ చల్లా ఓబులేశ్ పర్యవేక్షణలో వినాయక ఘాట్ ఎగువ, దిగువన కాలువకు అడ్డంగా గోడలు నిర్మిం చారు. నగరానికి తాగునీరు అందించే ప్రధాన పంప్ హౌస్ నుంచి వచ్చే ట్రీట్‌మెంట్ వాటర్‌ను శుద్ధి చేసి వినాయక ఘాట్‌లో నిల్వచేస్తున్నారు. భక్తుల అభిరుచులకు అను గుణంగా ఘాట్ ప్రాంతంలో కేసీ కాలువలో పేరుకుపోయిన చెత్త, చెదారం, మురు గును శుభ్రం చేసి, రంగులు వేసి అందంగా తీర్చిద్దారు. అదే క్రమంలో హంద్రీనీవా కాలువలో కూడా నిమజ్జనం ఏర్పాట్లు చేశారు. భక్తులు తమకు ఇష్టమైన ప్రదేశంలో గణనాథుడికి వీడ్కోలు పలికేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంలో నిమజ్జన ఏర్పాట్లు దాదాపుగా పూర్తి చేశారు.