ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు పూర్తి
ABN , Publish Date - Nov 21 , 2026 | 11:21 PM
కర్నూలు నగర పాలక సంస్థ పాలకవర్గం ఈ నెల 23న కొలువుదీరనున్న నేపథ్యంలో స్థానిక ఎస్‌బీఐ ఎంప్లాయిస్ కాలనీలోని నగర పాలక సంస్థ సమావేశ భవనంలో ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు కమిషనర్ చల్లా ఓబులేసు తెలిపారు.
నగర పాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు
కర్నూలు న్యూసిటీ, నవంబరు 21(ఆంధ్రజ్యోతి): కర్నూలు నగర పాలక సంస్థ పాలకవర్గం ఈ నెల 23న కొలువుదీరనున్న నేపథ్యంలో స్థానిక ఎస్‌బీఐ ఎంప్లాయిస్ కాలనీలోని నగర పాలక సంస్థ సమావేశ భవనంలో ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు కమిషనర్ చల్లా ఓబులేసు తెలిపారు. శనివారం సమావేశ భవనంలో ప్రమాణస్వీకారానికి సంబంధించిన ఏర్పాట్లును ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. కార్పొరేటర్లు, మంత్రి, ఎంిపీ, ఎమ్మెల్యేలు వచ్చేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. అదే విధంగా సమావేశ భవన సమీపంలోని సెయింట్ జోసఫ్ కళాశాలలో భోజన వసతి, పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేశామన్నారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా వాహనాలు అన్ని కూడ సెయింట్ జోసఫ్ కళాశాలకు వెళ్లే విధంగా పోలీసు అధికారులతో సమన్వయం చేసుకున్నామని ఆయన తెలిపారు. ప్రమాణస్వీకారానికి సంబంధించి ఎలాంటి లోటుపాట్లు జరగకుండ అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఈ జే.రమణమూర్తి, కార్యదర్శి నాగరాజు, ఎంఈలు మనోహర్‌రెడ్డి, గిరిరాజు, డీఈఈ పవన్‌కుమార్ రెడ్డి, ఆర్‌ఐ శ్రీకాంత్ పాల్గొన్నారు.