‘సుఖీభవ-పీఎం కిసాన్’కు ఏర్పాట్లు
ABN , Publish Date - Jun 18 , 2026 | 11:43 PM
: ప్రస్తుత ఖరీఫ్‌లో రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక భరోసా కల్పించేందుకు అన్నదాత సుఖీభవతో పాటు పీఎం కిసాన్ పథకాల కింద డబ్బు విడుదలకు ఏర్పాట్లు చేశామని కర్నూలు జిల్లా వ్యవసాయ శాఖ జేడీ వరలక్ష్మి తెలిపారు.
అర్హులైన రైతులందరికీ ప్రయోజనం
వ్యవసాయ శాఖ జేడీ వరలక్ష్మి
కర్నూలు అగ్రికల్చర్, జూన్ 18 (ఆంధ్రజ్యోతి): ప్రస్తుత ఖరీఫ్‌లో రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక భరోసా కల్పించేందుకు అన్నదాత సుఖీభవతో పాటు పీఎం కిసాన్ పథకాల కింద డబ్బు విడుదలకు ఏర్పాట్లు చేశామని కర్నూలు జిల్లా వ్యవసాయ శాఖ జేడీ వరలక్ష్మి తెలిపారు. గురువారం కలెక్టరేట్‌లోని తమ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకాల కింద అర్హులైన రైతుల జాబితాలపై వివ రాలు వెల్లడించారు. కర్నూలు జిల్లాలో అన్నదాత సుఖీభవ పథకం కింద 2,72,757 మంది రైతులను అర్హులుగా ఎంపికయ్యారని రాష్ట్ర ప్రభుత్వం మొదటి విడత జూన్ 20న ఒక్కొక్కరికి రూ.5వేల చొప్పున రూ.136.38 కోట్లు విడుదల చేయడం జరిగిందన్నారు. అదే విదంగా కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం కింద ఒక్కొక్కరికి రూ.2వేల చొప్పున 2,18,846 మంది రైతులకు రూ.43.77 కోట్లు, ఈ నెల 20న లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో నేరుగా జమ అవుతాయని అన్నారు. అర్హత గల ప్రతి రైతుకు ఈ పథకాలవల్ల ప్రయోజనం అందేలా వ్యవసాయాధికారులు దృష్టి పెట్టాలని అన్నారు.